Breaking News

గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్‌

Published on Tue, 07/28/2026 - 11:17

పారిస్‌లోని పోర్ట్ డి క్లిచీ సమీపంలో ఒక  దుండగుడు వీరంగం సృష్టించాడు.  రెండు  పొడవైన కత్తులతో ముగ్గురు మహిళలపై దాడి చేశాడు.  ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే డ్యూటీ పోలీస్ అధికారి చాకచక్యంగా అతడిని  బంధించి,  అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. ఈ ఘటన 'పోర్ట్ డి క్లిచీ' ప్రాంతం సమీపంలో జరిగింది.  


ఫ్రాన్స్ రక్షణ మంత్రి లా‌రెంట్ నునెజ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం,నిందితుడు రెండు వంటగది కత్తులతో 19, 24, 36 ఏళ్ల వయస్సున్న మహిళలపై దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఒకరు గర్భిణి. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. డ్యూటీలో ఉన్న పోలీసు బాటసారులతో కలిసి అడ్డుకుని  నిందితుడిని  ఆ టకట్టించడం ప్రశంసలందుకుంటోంది. గుర్తుతెలియని ఆ నిందితుడు, తానీ నేరం చేయడానికి "అల్లాహ్" ఆజ్ఞాపించాడని పేర్కొన్నాడు. పారిస్ వీధిలో ఆ వ్యక్తి కత్తితో దాడికి దిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి స్నాప్‌చాట్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో నిజమైనదేనని రాయిటర్స్ వార్తా సంస్థ ధృవీకరించింది.

 > 
ఆ వీడియోలో పొడవాటి నల్లని జుట్టు, క్రీమ్ రంగు ట్రాక్‌సూట్ ధరించిన ఒక వ్యక్తి రెండు చేతుల్లో పెద్ద కత్తులు పట్టుకుని, ఒక యువతిపై దాడి చేసి పొడవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి.  అలాగే అదే వ్యక్తి నేలపై పడిపోగా, బాటసారులు అతడిని కదలకుండా పట్టుకున్నారు. నేలపై పడి ఉన్న ఆ వ్యక్తి "నన్ను ఇలా చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించాడు" అని అనడం వీడియోలో వినిపిస్తోంది. 

ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!

ఎలా పట్టుకున్నారంటే..
నిందితుడు ఒక మహిళ వెనుక భాగంలో పొడవడం చూసి, 'రండి, అతడిని ఆపుదాం!' అని గట్టిగా అరిచాడు పోలీసు అధికారి. వెంటనే పలువురు ముందుకు వచ్చారు. ఇంతలో మరో వ్యక్తి అతనిపైకి సూట్‌కేస్‌ను విసిరాడు. దాంతో  అతని చేతిలో  కింత పడిపోయాయి.. ఆ సమయంలో  పోలీసు అతడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తితో నిందితుడిని బంధించిన ఆఫ్ డ్యూటీ పోలీస్ అధికారిని మంత్రి నునెజ్ ప్రశంసించారు.

ఈ దాడికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని నునెజ్ తెలిపారు.  నిందితుడి వివరాలను నిర్ధారించలేదు.  ఈ ఘటనపై తీవ్రవాద నిరోధక విచారణ చేపట్టాలా వద్దా అనే కోణంలో ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూటర్ కార్యాలయం పరిశీలిస్తోంది.

ఇదీ చదవండి: హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నా జీవితాన్నే మార్చేసింది

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)