Breaking News

దిగొచ్చిన మాల్దీవ్స్‌.. ప్లీజ్‌ అంటూ భారత్‌కు అభ్యర్థన

Published on Tue, 05/07/2024 - 09:38

భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో.. అక్కడి పర్యాటకం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్‌ను బతిమాలడం మొదట్టింది. తమ దేశ పర్యాటకంలో మళ్లీ భాగం కావాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్‌ భారత్‌ను కోరారు. 

సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మాక్కూడా ఓ చరిత్ర ఉంది. మాల్దీవుల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్యానికి భారత్‌తో కలిసి పని చేయాలని ఉంది. మేము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాం. భారత్‌ నుంచి వచ్చేవారికి మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతుంది. దయ చేసి భారతీయులు మాల్దీవుల పర్యాటకంలో తిరిగి మళ్లీ భాగం కావాలని కోరుతున్నా. మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యటకం ఆధారపడి ఉంటుంది’ అని ఇబ్రహీం ఫైసల్‌ భారత్‌ను కోరారు.

ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలపై మాల్దీవుల మంత్రులు అనుచిత  వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మంత్రల వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు.  ఇక నుంచి తాము మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుంటామని పలువురు భారతీయ ప్రముఖులు పేర్కొన్న విషయం తెలిసిందే. 

ఇక.. అప్పటి నుంచి మాల్దీవులు పర్యాటకం దెబ్బతింది. మరోవైపు.. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు విధానాల వల్ల దౌత్య  సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారతీ సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని మొయిజ్జు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో కొంత మంది సైనికులు భారత్‌కు వచ్చారు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)