Breaking News

Maldives: ‘మేలో భారత్‌ బలగాలు వెనక్కి.. ఏ దేశ జోక్యం అనుమతించం’

Published on Mon, 02/05/2024 - 15:14

భారత్‌-మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు భారత భద్రత బలగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ దేశ సార్వభౌమాధికారంలో ఏ దేశం జోక్యం చేసుకోవద్దని భారత్‌ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం గమనార్హం. తమ ద్వీపదేశం నుంచి భారత్‌కు చెందిన భద్రతా బలగాలు మే 10 తేదీ వరకు వెనక్కి వెళ్లడానికి ఇరు దేశాల మధ్య ఒ‍ప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. 

మూడు బృందాలుగా ఉన్న భారత్‌ భద్రతా బలగాల్లో మొదటి బృందం మార్చి 10 తేదిన మాల్దీవుల నుంచి వెళ్లిపోనుందని తెలిపారు. అదేవిధంగా మిగిలిన రెండు సైనిక బృందాలు సైతం మే10లోగా పూర్తిగా మాల్దీవుల నుంచి వైదొలుగుతాయని పార్లమెంట్‌లో పేర్కొన్నారు. తమ దేశ అంతర్గత విషయాలకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలను భారత్‌తో ఇక మీదట పునరుద్దరించబోమని వెల్లడించారు. తమ దేశ సార్వభౌమాధికంలోకి ఏ ఇతర దేశం జోక్యం చేసుకోరదని.. అలా జోక్యం చేసుకోవడానికి ‍ప్రయత్నిస్తే  తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోదని స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన 80 మంది భద్రతా బలగాలు.. మాల్దీవుల  దేశంలో మానవతా సాయం, వైద్య అత్యవసర సాయం అందించటంలో సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక.. మహ్మద్‌ మొయిజ్జు ప్రభుత్వంపై ఇక్కడి ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి కొనసాగతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంనే ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమోక్రాట్లు పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్‌ చేశాయి. కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే పార్లమెంట్‌ సమావేశాలకు హజరుకాగా.. 56 మంది గైర్హాజరు అయ్యారు. ఇటీవల పార్లమెంట్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో ఓ దశలో.. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మహ్మద్‌ మొయిజ్జు  ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేపెట్టడానికి కూడా సిద్ధపడ్డ విషయం తెలిసిందే.

చదవండి: UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్‌

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)