Breaking News

Maldives: ‘భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోంది’

Published on Sun, 05/26/2024 - 10:57

మాలె: మాల్దీవులుతో  స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చేసుకోవడానికి భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ మంత్రి మహ్మద్‌  సయీద్ అన్నారు. అయితే దానికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మాలెలో ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్‌ సయీద్ మీడియాతో మాట్లాడారు.

‘‘దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(SAFTA)తో పాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్‌ కోరుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకోవడానికి అన్ని దేశాలకు అవకాశం కల్పించారు. వాణిజ్య కార్యకలాపాలను మరింత సులభతరం చేయటంలో భాగంగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని మహ్మద్‌ సయీద్ అన్నారు.

ఇక.. గతేడాది భారత   ప్రధాని మోదీ లక్ష్యదీప్‌ పర్యటన సందర్భంగా దీగిన ఫొటోలు, వీడియోలపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో  ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బ తిన్నాయి. అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జుకు చైనా అనుకూలుడనే పేరు  ఉండటం. అదే విధంగా మాల్దీవుల్లో ఉన్న భారత్‌ బలగాలను వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించటం వంటి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

అయినప్పటికీ భారత్  మాల్దీవుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్‌లో 50 మిలియన్‌  డాలర్ల అర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. 1981లో ఇండియా-మాల్దీవుల మధ్య అత్యవసర సరుకుల ఎగుమతుల కోసం వాణిజ్య ఒప్పందం కుదిరింది. 2021లో మొదటిసారి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 300 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది.  ఆ తర్వాత సంవత్సరాల్లో అదికాస్త ఇంకా పెరుగుతూ 500 మిలియన్‌ డాలర్లు చేరుకుంది.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు