Breaking News

‘బాయ్‌కాట్‌’ దెబ్బ గట్టిగా తగిలింది: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

Published on Sat, 03/09/2024 - 09:31

న్యూఢిల్లీ: మాల్దీవులపై భారత్‌ ఇచ్చిన బాయ్‌కాట్‌ కాల్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ ఇచ్చిన బాయ్‌కాట్‌ పిలుపుతో మాల్దీవుల పర్యాటకంపై భారీ ప్రభావం పడిందని చెప్పారు. ఈ విషయమై ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్‌ మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌ బాయ్‌కాట్‌ పిలుపు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

దీనిపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాను. హాలీడేస్‌కు భారత ప్రజలు మాల్దీవులకు రావాలని కోరుకుంటున్నాను. మా ఆతిథ్యంలో ఎలాంటి తేడాలుండవు. భారత్‌, మాల్దీవుల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలి. ఈ పర్యటనలో ప్రధాని మోదీని కూడా కలిశాను. నేను మోదీకి పెద్ద మద్దతుదారును. ఆయనకు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నాను’అని నషీద్‌ తెలిపారు.

మాల్దీవుల నుంచి భారత సైన్యం వైదొలగాలని ప్రస్తుత అధ్యక్షుడు  మహ్మద్‌ మిజ్జు తీసుకున్న నిర్ణయంపైనా నషీద్‌ స్పందించారు. దీనిపై ఇరు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, చైనా మద్దతుదారుగా పేరున్న ప్రస్తుత మాల్దీవుల ప్రధాని మిజ్జు ఈ నెల 10లోగా భారత సైన్యం మాల్దీవులను విడిచి వెళ్లాలని డెడ్‌లైన్‌ పెట్టిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదురు చూస్తున్నవారిపై పారాచూట్‌ 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)