Breaking News

గాయని చిత్ర అయ్యర్‌ సోదరి దుర్మరణం, ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Published on Mon, 01/05/2026 - 15:26

మలయాళ నేపథ్య గాయని చిత్ర అయ్యర్ సోదరి 52 ఏళ్ల శారదా అయ్యర్‌ ఒమన్‌లో దుర్మరణం పాలయ్యారు. ఒమన్‌లో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి కచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం, కేరళలోని తాజవాకు చెందిన శారదా అయ్యర్‌ ఒమన్ ఎయిర్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. ప్రస్తుతం మస్కట్‌లో నివసిస్తున్నారు. ఒమన్‌లోని అల్ దఖిలియా గవర్నరేట్‌లోని జెబెల్ షామ్స్ ప్రాంతంలోని కఠినమైన వాడి ఘుల్  గుర్తింపు పొందిన మార్గాలలో ట్రెక్కింగ్ చేస్తున్న బృందంలోటీంలో  ఆమె కూడా ఒకరని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అయ్యర్ మృతదేహాన్ని ఒమన్ నుండి కేరళకు తీసుకువస్తున్నారు. జనవరి 7న తాజవాలోని వారి పూర్వీకుల ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

దివంగత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్.డి. అయ్యర్, రోహిణికుమార్తె శారదా అయ్యర్‌. డిసెంబర్ 11న  తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 24న తిరిగి ఒమన్‌కు వచ్చినట్లు సమాచారం. తన సోదరి మరణంపై చిత్ర భావోద్వేగానికి  లోనయ్యారు. అందమైన నా సోదరీ, నువ్వు వెళ్లిపోయావు.. ఫోన్‌లో నాన్‌స్టాప్‌గా మాట్లాడే నీగొంతు వినకుండా, పక్కగదిలో నిరంతరం వినిపించే నీ అరుపులు లేకుండా నేను ఎలా జీవించాలి.. తొందరగా వెళ్లిపోయావు.. నేను కూడా నీతో  పాటే’’ చాలా ఆవేదనతో కూడిన ఆమె  ఇన్‌స్టా పోస్ట్‌ పలువురి కంట కన్నీరు పెట్టిస్తోంది. చాలా తక్కువ వ్యవధిలోనే అటు తండ్రిని, ఇటు సోదరిని కోల్పోయిన చిత్రకు అభిమానులు, సన్నిహితులు సానుభూతి ప్రకటించారు. 

సాధారణంగా  శారదా అయ్యర్‌ అండ్‌ టీం ట్రెక్కింగ్‌కు వెళ్లిన ప్రదేశంలోని నిటారుగా ఉండే కొండలు , సవాలుతో కూడినభూభాగం ట్రెక్కింగ్ చేసేవారికి ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)