Breaking News

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం

Published on Wed, 11/26/2025 - 17:36

హాంకాంగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాయ్ జిల్లాలోని నూతనంగా నిర్మిస్తున్న ఒక బహుళ అంతస్థుల భవన సముదాయంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  13 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

కొంతమంది మంటలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. 

కాగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం. నిర్మాణంలో ఉ‍న్న భవంతి కావడంతో  వెలుపలి భాగంలో వెదురుబొంగులను అమర్చారు. మంటలు వాటికి అంటుకోవడంతో పెద్దఎత్తున అగ్నిజ్వాలలు ఎగిసిపడి దట్టమైన పొగ కమ్ముకుంది. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

తాయ్ పో నగరం హాంకాంగ్ ఉత్తర భాగంలో ఉంటుంది. హాంకాంగ్‌లో భవన నిర్మాణరంగంలో వెదురు బొంగుల వాడకం అనేది సర్వసాధారణం. వీటి వల్ల భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వానికి ఇది వరకే అక్కడి అధికారులు నివేదించినట్లు తెలుస్తోంది. దానిపై స్పందించిన అక్కడి ప్రభుత్వం నిర్మాణం రంగంలో వెదురుబొంగుల వాడకం దశలవారీగా తొలిగిస్తామని ఈ ఏడాది ప్రారంభంలో తెలిపినట్లు సమాచారం. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)