Breaking News

న్యూ ఇయర్‌లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి

Published on Thu, 01/01/2026 - 17:41

నూతన సంవత్సర వేడుకల సమయంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లోని చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చి భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.19వ శతాబ్దపు ఈ చర్చికి సంబంధించి 50 మీటర్ల (164 అడుగుల) టవర్ కూలిపోయింది. పైకప్పు తీవ్రంగా దెబ్బతింది 

గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మక వోండెల్కెర్క్ (వోండెల్ చర్చి)లో  సంభవించిన ఈ  అగ్నిప్రమాదంలో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల్లోనే, 154 సంవత్సరాల పురాతన స్మారక చిహ్నంలో భాగమైన చర్చి టవర్ పూర్తిగా కూలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్‌ సంబరాల్లో మునిగితేలుతున్న నగరం అంతటా తీవ్ర గందర గోళం ఏర్పడింది. అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన  వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేదిఇంకా తెలియరాలేదు.

వోండెల్కెర్క్ చర్చిని ఎపుడు నిర్మించారు?
1872లో వోండెల్కెర్క్ చర్చ్‌ నిర్మితమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ రూపొందించారు.  1970లలో పునరుద్ధరించారు.  1977 వరకు రోమన్ కాథలిక్ చర్చిగా పనిచేసింది. 
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)