Breaking News

పుడమి పొర చిరిగిపోతోందా?

Published on Thu, 11/13/2025 - 05:20

వాషింగ్టన్‌: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ఖండాలుగా విడిపోయిన భూఉపరితం కొన్ని కోట్ల సంవత్సరాలక్రితం ఒకే అఖండ గోండ్వానా ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడీ ఖండాలు నెమ్మదిగా మరింత దూరంగా వెళ్తున్నా యనే సిద్ధాంతమూ వింటున్నాం. అయితే ఈ ఖండాలు దూరంగా జరిగే క్రమంలో కేవలం ఉపరితల భూమి మాత్రమే చీలిపోవడంలేదని మహాసముద్రాల అడుగుల వందల కిలోమీటర్ల లోతులోనూ భూమి పొర చీలిపోతోందని తాజా అధ్యయనంలో తేలింది. దూరంగా జరిగినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీ లేదని అనుకో కూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

ఖండాల భూగర్భ పొర చీలిపోవడంతో దాని అడుగున ఉన్న శిలాద్రవ మ్యాంటిల్‌ పొర నుంచి భడభాగ్ని లాంటి శిలాద్రవం బయటకు ఎగజిమ్మే ఆస్కార ముంది. దీంతో కొత్తగా లెక్కలేనని అగ్నిపర్వ తాలు పుట్టుకొచ్చే ప్రమాదముందని భూభౌగో ళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త అగ్ని పర్వ తాలు కోట్ల ఏళ్లపాటు అలాగే శిలాద్రవం, మాగ్మాను ఎగజిమ్మే పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో స్పష్టమైంది. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘నేచర్‌ జియోసైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

 సాధారణంగా వేర్వేరు భూఫలకాలకొనలు పరస్ప రం ఢీకొనడం, రాపిడి సందర్భాల్లోనే అగ్ని పర్వ తాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు కొత్తగా సముద్ర గర్భంలోనూ అగ్నిపర్వతాలు ఏర్పడి కోట్ల సంవత్సరాలపాటు అవి అలాగే క్రియాశీలకంగా ఉండిపోయే ప్రమాదం ఉందని అధ్యయనకారులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలోని సౌతాంప్టన్‌ విశ్వ విద్యాలయం, పోట్స్‌డామ్‌లోని జీఎఫ్‌జెడ్‌ హెల్మ్‌ హోట్జ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్, పోట్స్‌డ్యామ్‌ యూనివర్సిటీ, కెనడాలోని క్వీన్స్‌ విశ్వవిద్యా లయం, స్వాన్‌సియా యూనివర్సిటీలోని పరిశో ధకుల బృందం సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టింది. కంప్యూటర్‌ స్టిములేషన్‌ విధానంలో ఖండాల చీలిక కారణంగా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరగబోయే విపరిణామాలను వీళ్లు విశ్లేషించగలిగారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)