Breaking News

మడగాస్కర్‌లో సైనిక తిరుగుబాటు

Published on Mon, 10/13/2025 - 05:15

అంటాననరివో: ఆఫ్రికా దేశం మడగాస్కర్‌లో మరోసారి అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా ప్రకటించారు. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జరిగే ప్రయత్నా లను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు వస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. 

సైనిక బలగాలు ఐక్యంగా ఉండి, రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియడం లేదు. తాను దేశంలోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని రజొలినా కూడా ప్రకటించారు. రజొలినా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ సెప్టెంబర్‌ 25వ తేదీ నుంచి జెన్‌ జెడ్‌ మడగాస్కర్‌ పేరుతో యువత ఆందోళనలు సాగిస్తోంది. శనివారం అతిపెద్ద ర్యాలీ జరిగింది.

 ఈ ప్రదర్శనలో ఆర్మీలో కీలకమైన క్యాప్‌శాట్‌ అనే యూనిట్‌ కూడా పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆదివారం అధ్యక్ష కార్యాలయం తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జాడలు లేవు. రాజధాని వీధుల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. తిరుగుబాటుకు కారణాలు, దీని వెనుక ఎవరున్నారు..వంటి విషయాలను అధ్యక్షుడు రజొలినా వెల్లడించలేదు.
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు