Breaking News

ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు.. ‘లో రియాల్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌ రికార్డు 

Published on Sat, 12/30/2023 - 08:09

న్యూఢిల్లీ: కాస్మటిక్స్‌ దిగ్గజం లో రియాల్‌ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఏకంగా 100 బిలియన్‌ డాలర్ల పై చిలుకు సంపదను ఆర్జించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచారు. అంతేగాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీ, అమానికో ఓర్టెగా వంటి వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెడుతూ 12వ స్థానానికి ఎగబాకారని బ్లూంబర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌ ప్రకటించింది.

 70 ఏళ్ల మేయర్స్‌ 268 బిలియన్‌ డాలర్ల విలువైన లో రియాల్‌ వ్యాపార సామ్రాజ్యానికి వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నారు. ఆమె కుటుంబానికి కంపెనీలో 35 శాతం దాకా వాటాలున్నాయి. 2017లో మేయర్స్‌ తల్లి మరణానంతరం అపారమైన ఆస్తి, కంపెనీ వాటాలు ఆమెకు వారసత్వంగా దక్కాయి. తాజాగా కంపెనీ వాటాల విలువ ఒక్కసారిగా చుక్కలనంటడంతో మేయర్స్‌ సంపద బిలియన్‌ డాలర్ల మార్కును దాటేసింది. మీడియాకు దూరంగా రోజూ గంటల తరబడి పియానో వాయిస్తూ గడుపుతుంటారామె.  


   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)