Breaking News

చిన్న వయసు.. ముసలి శరీరం.. ఇకలేదు

Published on Tue, 10/08/2024 - 10:28

అమితాబ్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘పా’ గుర్తుండేవుంటుంది. అందులో అమితాబ్‌ అత్యంత అరుదైన జన్యు సంబంధిత వ్యాధి ప్రొజెరియాతో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు బాల్యంలోని వృద్ధాప్య ఛాయలు రావడంతో పాటు ఆ లక్షణాలు కూడా వచ్చి మరణిస్తుంటారు. ‘పా’ సినిమా వచ్చిన తరువాత చాలామందికి ఈ వ్యాధిపై అవగాహన ఏర్పడింది. ఇదే వ్యాధితో సుదీర్ఘ కాలం జీవించిన ‘సమ్మీ బస్సో’ తన 28వ ఏట కన్నుమూశాడు.  

‘సమ్మీ బస్సో’ అరుదైన జన్యు వ్యాధి ‘ప్రొజెరియా’తో బాధపడుతూ ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఈ వ్యాధి సోకిన చిన్నారులు తమ రెండేళ్ల వయసు నుంచే వృద్ధాప్యానికి చేరుకుంటారు.  మీడియాకు అందిన వివరాల ప్రకారం ‘సమ్మీ బస్సో’ తన 28వ ఏట కన్నుమూశాడు. ప్రొజెరియాను హచిన్సన్-గిల్ఫోర్డ్ సిండ్రోమ్ లేదా హెచ్‌జిపిఎస్ అని కూడా పిలుస్తారు. ప్రొజెరియా  వ్యాధి సోకినప్పుడు  చిన్నారులు వయసు మీద పడినట్లు కనిపిస్తారు, ప్రొజెరియా బారిన పడినవారి ఆయుర్ధాయం గరిష్టంగా 13.5 ఏళ్లు మాత్రమే ఉంటుంది.

ఈ వ్యాధి ప్రతి ఎనిమిది మిలియన్ల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది . అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మిలియన్లలో ఒకరిని బాధిస్తుంది. 1995లో ఇటలీలోని వెనెటోలో జన్మించిన సమ్మీ బస్సోకు రెండేళ్ల వయసులో ప్రొజెరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది.  ఈ నేపధ్యంలో అతని తల్లిదండ్రులు ఇటాలియన్ ప్రొజెరియా అసోసియేషన్‌ను స్థాపించారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలో సమ్మీ బస్సో జీవితాన్ని చూపించిన నేపధ్యంలో ప్రొజెరియా వ్యాధి అంటే సమ్మీ బస్సో గుర్తుకు వచ్చేలా చేసింది.

సమ్మీ బస్సో స్నేహితులలో ఒకరైన రికార్డో అతని మరణాంతరం తన ఆవేదనను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ రోజు మా  ఇంటి దీపం ఆరిపోయింది. నీ అద్భుతమైన జీవితంలో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు ధన్యవాదాలు సమ్మీ ’ అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రాశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్ ప్రొజెరియా కేసులు 130 మాత్రమే నమోదయ్యాయి. వాటిలో నాలుగు ఇటలీలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: హమాస్‌ చీఫ్‌ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్‌ మీడియా

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)