Breaking News

కిలోమీటర్‌ బిల్డింగ్‌!

Published on Fri, 10/11/2024 - 13:53

ఇప్పటివరకూ మనం ఒక భవనం ఎత్తును మీటర్లలోనే చెప్పుకుంటున్నాం... ఇకపై మాత్రం కిలోమీటర్లలో చెప్పుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి కిలోమీటరు ఎత్తైన భవనం తాలూకూ నిర్మాణం పూర్తవుతోంది మరి! ఎక్కడుందీ భవనం? ఎవరు కడుతున్నారు? ఎందుకు? ఖర్చెంత?...

ఎడారి దేశం సౌదీ అరేబియాలో కొత్త కొత్త ప్రపంచ రికార్డులు నమోదు కావడం కొత్త కాదు. ఎడారి మధ్యలో 170 కిలోమీటర్ల పొడవైన నగరం ‘ద లైన్‌’ నిర్మాణ దశలో ఉండగానే బోలెడన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. తాజాగా ‘జేఈసీ టవర్స్‌’ పేరుతో సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న కిలోమీటరు భవనం కూడా కొత్త రికార్డును సృష్టించింది. అన్నీ సవ్యంగా సాగితే సుమారు 1007 మీటర్లు అంటే కిలోమీటరు కన్నా పిసరంత ఎక్కువ ఎత్తు ఉన్న ఈ భవనం 2028 నాటికి అందుబాటులోకి రానుంది. 

కిలోమీటర్‌ ఎత్తు అంటే ఎంత? అని అనుకుంటూ ఉంటే కొన్ని పోలికలు చూద్దాం. ఈఫిల్‌ టవర్‌కు మూడు రెట్లు ఎక్కువ. లేదా న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ ఎత్తుకు రెట్టింపు. భారత్‌లోనే అతి ఎత్తైన బిల్డింగ్‌ లోఖండ్‌వాలా మినర్వా (78 అంతస్తులు, 301 మీటర్ల ఎత్తు) కంటే మూడు రెట్లు ఇంకొంచెం ఎక్కువన్నమాట. 

మొదట్లో ఈ జేఈసీ టవర్స్‌కు ‘కింగ్‌డమ్‌ టవర్‌’ అని పేరు పెట్టారు. కాకపోతే అప్పుడు లక్ష్యం ఒక మైలు ఎత్తు. ఇసుక నేలల్లో ఇంత ఎత్తైన భవనం కట్టలేమని స్పష్టమైన తరువాత దీన్ని కిలోమీటరుకు పరిమితం చేశారు. పేరు కూడా ముందు ‘జెడ్డా టవర్స్‌’ అని తాజాగా ‘జెడ్డా ఎకనమిక్‌ టవర్‌’ అని మార్చారు. 

దుబాయిలోని ఎత్తైన భవం ‘బుర్జ్‌ ఖలీఫా’ (828 మీటర్ల ఎత్తు)ను డిజైన్‌ చేసిన ఆడ్రియన్‌ స్మిత్‌, గార్డన్‌ హిల్‌లు ఈ జేఈసీ టవర్‌కూ రూపకల్పన చేశారు. ఎడారిలో పెరిగే ఓ చెట్టు ఆకుల మాదిరిగా త్రికోణ ఆకారంలో ఆకాశాన్ని అంటేలా ఉంటుందీ భవనం. ఎర్ర సముద్ర తీరంలోని జెడ్డా నగరం బీచ్‌ ఒడ్డునే కడుతున్నారు.

భవనం ఎత్తు పెరిగిన కొద్దీ పై అంతస్తుల్లో గాలి చాలా బలంగా వీస్తుంటుందని మనకు తెలుసు. అందుకే జేఈసీ టవర్‌ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. బలమైన గాలులను తట్టుకోవడమే కాకుండా.. సూర్యుడి ఎండ ప్రతాపాన్ని తగ్గించేందుకూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక నేలలో సుమారు 344 అడుగుల లోతైన 270 కాంక్రీట్‌ దిమ్మెల పునాదులపై నిర్మాణమవుతోంది. 

అంతస్తులు ఎన్నో తెలుసా?

లోఖండ్‌ వాలా మినర్వాలో మొత్తం 78 అంతస్తులు ఉండగా.. జేఈసీ టవర్‌లో ఏకంగా 157 అంతస్తులు ఉండబోతున్నాయి. మొత్తం 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బుర్జ్‌ ఖలీఫాలో దుబాయి నగరం మొత్తన్ని వీక్షించేందుకు 128వ అంతస్తులో ఏర్పాట్లు ఉంటే.. జేఈసీ టవర్‌లో ఇంతకంటే ఎత్తైన అంతస్తులో వ్యూపాయింట్‌ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ హోటల్‌, కార్యాలయాలు కూడా భవనం లోపల ఏర్పాటవుతాయి. 

జేఈసీ టవర్‌ నిర్మాణం పదేళ్ల క్రితమే మొదలైనా 60వ అంతస్తు స్థాయికి చేరేటప్పటికి ఆగిపోయింది. కొన్నేళ్ల విరామం తరువాత మూడేళ్ల క్రితం మళ్లీ నిర్మాణం మొదలై పూర్తి చేసుకోబోతోంది. ఇంతకీ ఈ భవనం కట్టేందుకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పలేదు కదా... అక్షరాలా... 720 కోట్ల సౌదీ అరేబియా రియాళ్లు! రూపాయల్లో చెప్పుకోవాలంటే 159,662,700,000! పదిహేను వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువన్నమాట!!!

-జి.గోపాలకృష్ణ మయ్యా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)