ప్రపంచానికి మరో పెనుముప్పు: సజీవ నోస్ట్రాడామస్ హెచ్చరిక!

Published on Sat, 08/01/2026 - 10:02

లండన్‌: ఆర్కిటిక్ వలయంలో కొత్త యుద్ధం ముసురుకొస్తోందని, కరిగిపోతున్న మంచు కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని తనను తాను ‘సజీవ నోస్ట్రాడామస్’గా  పేరొందిన అథోస్ సలోమ్ హెచ్చరించారు. 2026 సంవత్సరానికి సంబంధించి తాను చేసిన అంచనాల్లో ఇప్పటికే రెండు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

గత ఏడాది సలోమ్ 2026 కోసం పది జోస్యాలు వెలువరించారు. అందులో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని, మధ్యప్రాచ్యంలో అస్థిరత ఏర్పడుతుందని ఆయన ముందుగానే చెప్పారు. అలాగే, ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతగా స్పెయిన్ నిలుస్తుందని తాను ముందే అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. విజేత జట్టు జెర్సీ రంగులు అగ్నిని పోలి ఉంటాయని, ఆ జాబితాలో స్పెయిన్ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆర్కిటిక్ ప్రాంతంలోని మంచు కరిగిపోతుండటం వల్ల కొత్త నౌకా మార్గాలు, శక్తి వనరులు బయటపడుతున్నాయని సలోమ్ తెలిపారు. ఈ వనరుల కోసం రష్యా, నాటో దేశాల మధ్య ప్రమాదకరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఆర్కిటిక్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలకు క్షిపణి వ్యవస్థలను తరలిస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ప్రత్యక్ష ఘర్షణలకు ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదేవిధంగా ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర నైగర్ ప్రాంతంలో తీవ్రవాద గ్రూపుల ప్రాబల్యం పెరుగుతోందని, పాశ్చాత్య దేశాల సైన్యం వెనుదిరిగిన తర్వాత తమ ప్రభావాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాల మధ్య ఈ ప్రాంతం పరోక్ష ఘర్షణలకు వేదికవుతుందని సలోమ్ తెలిపారు.

తాను కేవలం భవిష్యవేత్తను మాత్రమే కానని, పారాసైకాలజిస్ట్ అని సలోమ్ స్పష్టం చేశారు. భవిష్యత్ సంఘటనలను అంచనా వేయడానికి తాను ప్రతీకాత్మక విశ్లేషణ, దీర్ఘకాలిక నమూనా పరిశీలన, కబల్లా అధ్యయనాలను ఉపయోగిస్తానని చెప్పారు. అయితే, ఏ అంచనా పద్ధతి కూడా వంద శాతం ఖచ్చితమైనది కాదని, అన్నీ కేవలం అర్థం చేసుకోవడానికేనని ఆయన అంగీకరించారు. గతంలో ఆయన కోవిడ్-19 మహమ్మారి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాన్ని కూడా అంచనా వేశారనే ప్రచారం ఉంది.

ఇది కూడా చదవండి: స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)