Breaking News

విమాన ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడి మృతి

Published on Thu, 12/25/2025 - 05:38

అంకారా: తుర్కియే రాజధాని అంకారా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్‌ జెట్‌ విమానం కుప్పకూలిన ఘటనలో లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్‌ ముహమ్మద్‌ అలీ అహ్మద్‌ అల్‌–హదద్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లిబియా ప్రధాన మంత్రి అబ్దుల్‌ హమీద్‌ దిబేబాహ్‌ ధృవీకరించారు. మంగళవారం రాత్రి 8.30 నిమిషాలకు అంకారాలోని ఎసెన్‌బోగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫాల్కన్‌– 50 రకం ప్రైవేట్‌ బిజనెస్‌ జెట్‌ చిన్న విమానం టేకాఫ్‌ అయింది.

 ఇందులో లిబియా సైన్యా ధ్యక్షుడు అలీ సహా నలుగురు సైనికాధికారులు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు. వీళ్లంతా తుర్కియేలో పర్యటన ముగించుకుని స్వదేశం పయనమయ్యారు. అయితే గాల్లోకి లేచిన కేవలం 40 నిమిషాల తర్వాత ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌(ఏటీసీ)తో విమాన సంబంధాలు తెగిపోయాయి. వెనువెంటనే 408 మంది సిబ్బందితో సహాయక, అన్వేషణ బృందాలు గాలింపు మొదలెట్టాయి. ఎయిర్‌పోర్ట్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని హేమన పరిధిలోని కెసిఖావ్‌ గ్రామ శివారులో విమాన శకలాలను గాలింపు బృందాలు గుర్తించాయి. విమానంలోని వారంతా చనిపోయి నట్లు నిర్ధారించాయి.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)