Breaking News

‘డేట్‌’కు పిలిచి.. రూ. 9 లక్షల బిల్లు ఎగ్గొట్టి..

Published on Sun, 08/31/2025 - 13:52

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. రూ. 9 లక్షల డిన్నర్‌ బిల్లుతో పాటు‘డేట్‌’ను కూడా అక్కడే వదిలి వెళ్లిన హాంకాంగ్ ‘లాయర్’ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాంకాంగ్‌లో న్యాయవాదిగా చలామణీ అవుతూ, లగ్జరీ డిన్నర్‌కు భారీగా ఆర్డర్‌ ఇచ్చి, ఆ మొత్తాన్ని ఎగ్గొట్టడమే కాకుండా, డేట్‌ను కూడా అక్కడే వదిలి వెళ్లిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అతనితో డేట్‌కు వచ్చిన యువతి అతని పేరు వాంగ్ అని మాత్రమే తెలుసని పోలీసులకు వివరించింది. తనను ఒక విలాసవంతమైన రెస్టారెంట్‌లో వదిలివేసి, 80 వేల అమెరికన్‌ డాలర్లు (రూ.9 లక్షలు) చెల్లించకుండా వెళ్లిపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంలో పోలీసులు వాంగ్‌ను ట్సుంగ్ క్వాన్ ఓలో అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో అతను ధరించినట్లు భావిస్తున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ‘ది స్టాండర్డ్‌’ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సెంట్రల్ డిస్ట్రిక్ట్ క్రైమ్ యూనిట్ దర్యాప్తులో ఉన్నాడు. సెంట్రల్‌లోని మాండరిన్ ఓరియంటల్ హోటల్‌లో విందు కోసం  ఒ‍క యువతిని డేట్‌ కు వాంగ్ ఆహ్వానించాడు. ఆ సమయంలో వాంగ్‌ ఆమెకు తాను న్యాయవాదినని పరిచయం చేసుకున్నాడు. డిన్నర్‌ సమయంలో వారు అత్యంత ఖరీదైన షాంపైన్ బాటిల్‌ను ఆర్డర్ చేశారు. మొత్తం బిల్లు రూ. 9లక్షలకు పైగానే వచ్చింది.

అయితే, ఆ బిల్లు చెల్లించే సమయానికి ‘న్యాయవాది’ వాష్‌రూమ్‌కు వెళ్లాలని ‘డేట్‌’కు చెప్పి, అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆమె ఫోనులో అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. దీంతో ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. తరువాత ఆమె స్నేహితుల సహాయం కోరగా, వారు డిన్నర్‌ బిల్లు చెల్లించారు. ‘డేట్‌’ బాధితురాలి ఫిర్యాదు దరిమిలా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

 

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)