Breaking News

ఐదేళ్లకు జాతర.. లక్షల జీవాలకు పాతర.. నేపాల్‌లో ఘోరం

Published on Mon, 12/16/2024 - 13:42

పొరుగు దేశం నేపాల్‌లో ఐదేళ్లకోమారు లక్షలాది మూగ జీవాలు బలి అవుతున్నాయి. ఈ అత్యంత ఘోరమైన చర్య బారా జిల్లాలోని గఢీమయీ దేవి జాతరలో చోటుచేసుకుంటుంది. ఈ జాతరలో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకూ మూగ జీవాలను బలిఇస్తుంటారు.  అయితే ఈసారి భారత సశాస్త్ర సీమ బల్, స్థానిక యంత్రాంగం మూగజీవాలను రక్షించేందుకు నిరంతరం శ్రమించింది.

డిసెంబరు 2న ప్రారంభమైన ఈ జాతర 15 రోజుల పాటు జరిగింది. జాతరలో డిసెంబర్ 8, 9 తేదీల్లో అంటే రెండు రోజుల్లోనే 4,200 గేదెలను బలి ఇచ్చినట్లు సమాచారం. అయితే అధికారుల చొరవకారణంగా 750 జంతువులు బలి బారినపడకుండా తప్పించుకున్నాయి. వీటిలో గేదెలు, గొర్రెలు, మేకలు ఇతర జంతువులు ఉన్నాయి. ఈ జంతువులను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వన్యప్రాణి పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.

నేపాల్‌లోని గఢీమయీ ఆలయంలో ఈ జాతరను డిసెంబర్ 2వ తేదీన నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ జాతర డిసెంబర్ 15 వరకు కొనసాగింది. డిసెంబరు 8వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించిన జనం లెక్కకుమించిన రీతిలో జంతువులను, పక్షులను బలి ఇచ్చారు. ఈ రక్తపాత సంప్రదాయానికి స్థానికుల మూఢనమ్మకాలే కారణంగా నిలుస్తున్నాయి.

265 ఏళ్లుగా గఢీమయీ  ఉత్సవం జరుగుతోంది. 2019లో జంతుబలిని నిలిపివేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రపంచంలోనే అత్యధిక జంతుబలులు ఈ జాతర సమయంలోనే జరుగుతాయని అంటారు. గఢీమయీ జాతర అతిపెద్ద సామూహిక బలి కర్మగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. ఇక్కడ మొదటగా వారణాసిలోని దోమ్రాజ్ నుంచి 5,100 జంతువులను తీసుకువచ్చి బలి ఇస్తారు. జాతర జరిగే రోజుల్లో రోజుకు ఐదు లక్షలాది మంది భక్తులు వస్తుంటారని అంచనా.

నేపాల్‌తో పాటు భూటాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌ సహా  పలు దేశాల నుంచి  లక్షలాదిమంది భక్తులు ఈ జాతరకు తరలివస్తుంటారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇటువంటి జంతు బలులను నిషేధించారు. నేపాల్‌లో జరిగే ఈ జాతరను వ్యతిరేకిస్తూ భారతదేశం కూడా తన గొంతు కలిపింది. 2019లో నేపాల్‌ సుప్రీంకోర్టు ఈ  జంతుబలిని వెంటనే నిషేధించడానికి నిరాకరించింది.  అయితే జంతుబలిని క్రమంగా తగ్గించాలని ఆదేశించింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినదని,  ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)