Breaking News

Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు

Published on Fri, 11/15/2024 - 12:09

కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్‌ వాయు కాలుష్యంతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్‌లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు.

పాక్‌లోని లాహోర్‌ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 1900ను దాటింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముల్తాన్‌లో కూడా ఏక్యూఐ 750 దాటింది. నాసాకు చెందిన మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్టర్ రేడియోమీటర్ ఉత్తర పాకిస్తాన్‌లో, ముఖ్యంగా లాహోర్, దాని పరిసరాలలో ఆకాశంలో వ్యాపించిన పొగమంచు చిత్రాలను షేర్‌ చేసింది.

శీతాకాలం ప్రారంభమైనప్పటి నుండి అంటే నవంబర్ నుండి లాహోర్ ఆకాశంలో దట్టమైన పొగమంచు కనిపిస్తోందని,  ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని నాసా తెలిపింది. లాహోర్‌లో పరిస్థితి  మరింత అధ్వాన్నంగా మారింది. పాఠశాలలు మూసివేశారు. పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో లాహోర్‌లోని మాయో ఆసుపత్రిలో 4,000 మంది బాధితులు చేరారు. అలాగే జిన్నా ఆసుపత్రిలో 3,500 మంది, పిల్లల ఆసుపత్రిలో 2,000 మందికి పైగా రోగులు చేరారు.

ఆస్తమా, హృద్రోగులు బయటకు వెళ్ల కూడదని వైద్యులు హెచ్చరించారు. వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ, నిర్మాణ స్థలాల నుంచి వెలువడుతున్న దుమ్ము మొదలైనవి లాహోర్‌లో వాయు కాలుష్యానికి కారణంగా నిలిచాయి. లాహోర్‌లో మూడు నెలల పాటు వివాహాలను నిషేధించారు. పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)