Breaking News

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. కువైట్‌లో సైరన్‌ మోత

Published on Sat, 01/17/2026 - 01:40

కువైట్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లో ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా సైరన్లు మోగించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కేవలం సాధారణ పరీక్ష మాత్రమేనని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దేశంలోని అత్యవసర హెచ్చరిక వ్యవస్థలు, పౌర రక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికీ ఈ పరీక్ష ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ డ్రిల్‌లో మూడు రకాల సైరన్లు వినిపించనున్నట్లు తెలిపారు. ప్రతి సైరన్‌కు ప్రత్యేక అర్థం ఉంటుందని వెల్లడించారు. మొదటి సైరన్ ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికగా, రెండోది ప్రమాదం కొనసాగుతున్నదని సూచికగా, మూడో సైరన్ ప్రమాదం ముగిసినట్లు తెలిపే సంకేతంగా ఉంటుందని అధికారులు వివరించారు.

ప్రజలు ఈ పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)