Kruger National Park: ట్రైన్‌ రిసార్ట్‌

Published on Mon, 02/12/2024 - 04:59

చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు.

అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్‌గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్‌ ఆన్‌ ది బ్రిడ్జ్‌’ హోటల్‌ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్‌లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు.

గైడ్‌ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్‌(జంట)రూమ్‌లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్‌ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్‌కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్‌ సీఈవో జెరీ మబేనా చెప్పారు.                             

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)