Breaking News

నేపాల్‌ కొత్త ప్రధానిగా కె.పి శర్మ ఓలి

Published on Sun, 07/14/2024 - 19:58

కఠ్మాండు: నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఆదివారం(జులై 14) నియమితులయ్యారు. మాజీ పీఎం పుష్ప కమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే.పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. 

ఈ క్రమంలోనే కె.పి.శర్మ ఓలి (72) నేతృత్వంలోని సీపీఎన్‌-యూఎంఎల్‌, మరో మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల (సీపీఎన్‌-యూఎంఎల్‌- 77, ఎన్‌సీ- 88) సంతకాలను ఓలి సమర్పించారు. దీంతో కొత్త ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. 

ఓలితో పాటు మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే ఓలి, దేవ్‌బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసేవరకూ దేవ్‌బా ప్రధానిగా కొనసాగుతారు.ఓలికి దేశ ప్రధానిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఉంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)