Breaking News

శక్తిమంతమైన దేశంగా ఉంటేనే శాంతి: కిమ్

Published on Fri, 10/30/2026 - 17:35

ఉత్తర కొరియా మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందించిన ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో భాగంగా 600 మి.మీ. సామర్థ్యం కలిగిన ‘స్నైపర్’ మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను తొలిసారిగా ఆవిష్కరించి, ప్రత్యక్షంగా పరీక్షించింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు.

ఈ రాకెట్ లాంచర్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. అంతేకాదు ఈ ప్రదర్శనలో ఒకేసారి పది కంటే ఎక్కువ లాంచర్లతో కాల్పులు జరిపారు. డ్రోన్ల ద్వారా క్షిపణులను ప్రయోగించారు. వాటితో పాటు ఆత్మాహుతి డ్రోన్ల దాడులను కూడా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. మారుతున్న యుద్ధ పరిస్థితుల్లో ఉత్తర కొరియా సైన్యం డ్రోన్ల యుద్ధంలో సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సైనిక బలం అవసరమని, శక్తిమంతమైన దేశంగా ఉంటేనే శాంతిని కాపాడుకోగలమని కిమ్‌ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటోంది. మరోవైపు తన దాయాది దేశమైన దక్షిణ కొరియాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల క్షిపణి పరీక్షలు, సరిహద్దు వివాదాలు ఇరు దేశాల మధ్య పరిస్థితిని మరింత తీవ్రంతరం చేశాయి. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కిమ్ తన సైనిక బలాన్ని పెంచుకోవడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: శాకాహారులైన టెక్ దిగ్గజాలు.. నా బ్రేక్‌ఫాస్ట్ స్టీక్, ఎగ్స్: ఎలాన్ మస్క్

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)