Breaking News

కెంటకీకి కేఎఫ్‌సీ గుడ్‌బై 

Published on Thu, 02/20/2025 - 06:02

కెంటకీ ఫ్రైడ్‌ చికెన్‌. క్లుప్తంగా కేఎఫ్‌సీ. పరిచయమే అక్కర్లేని ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్‌. ఈ ఫుడ్‌ జాయింట్‌ దిగ్గజానికి పిల్లల నుంచి పండు ముసలి దాకా లెక్కలేనంత మంది అభిమానులు! అమెరికాకు చెందిన ఈ బ్రాండ్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇంతకాలం తన కేరాఫ్‌గా నిలిచిన కెంటకీలోని లూయిస్‌విల్లే నుంచి టెక్సాస్‌లోని ప్లానోకు ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తోంది. 

కొన్ని కార్యకలాపాలు మాత్రం కెంటకీ నుంచి ఇకముందూ కొనసాగుతాయని యాజమాన్యం ప్రకటించింది. కేఎఫ్‌సీ నిర్ణయంపై కెంటకీ రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బెషెర్‌ విచారం వెలిబుచ్చారు. ఈ విషయం తెలిస్తే బహుశా ఆ సంస్థ వ్యవస్థాపకుడు కల్నల్‌ హార్లండ్‌ శాండర్స్‌ కూడా బాధపడి ఉండేవాడన్నారు. ‘‘ఆ కంపెనీ పేరే మా రాష్ట్రంతో మొదలవుతుంది. తన ఉత్పత్తుల విక్రయానికి మా రాష్ట్ర సంస్కృతిని, వారసత్వాన్ని ఉపయోగించుకుంది’’అని చెప్పు కొచ్చారు. 

పరిశ్రమలు, సంస్థలపై పన్నుల భారాన్ని టెక్సాస్‌ కొన్నే ళ్లుగా బాగా తగ్గించింది. దాంతో పాటు అక్కడి వ్యాపార అనుకూల వాతావరణానికి అమె రికన్‌ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్ర బాట పడుతున్నాయి. కేఎఫ్‌సీని 1930ల్లో కెంటకీలోని కోర్బిన్‌లో ఓ సరీ్వస్‌ స్టేషన్‌ దగ్గర ఫ్రైడ్‌ చికెన్‌ చిన్న దుకాణంగా శాండర్స్‌ మొదలు పెట్టారు. దాని రుచికి జనాలు ఫిదా కావడంతో చూస్తుండగానే యమా పాపులరైంది. ఇప్పుడు 145కు పైగా దేశాల్లో సంస్థకు ఏకంగా 24 వేల పై చిలుకు ఔట్‌లెట్లున్నాయి! ప్రతి కేఎఫ్‌సీ షాపు ముందూ కన్పించే గమ్మత్తైన ఫేసు దాని వ్యవస్థాపకుడు శాండర్స్‌దే. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)