Breaking News

స్టార్‌షిప్‌ మరో ప్రయోగంపై ఎలన్‌ మస్క్‌ అప్‌డేట్‌

Published on Tue, 06/27/2023 - 13:32

ఎలన్‌మస్క్‌ సారధ్యంలోని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్‌ స్టార్‌షిప్‌ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి దాటింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్‌ మస్క్‌ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని వెల్లడించారు. తాజాగా జరిగిన ఫ్లైట్‌-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు.దీనికి సంబంధించి తాజాగా టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లో షిప్‌ 25 సిక్స్‌ ఇంజిన్‌ స్టాటిక్‌ ఫైర్‌ టెస్ట్‌ పూర్తి చేసుకున్నదని ఒక ట్వీట్‌ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మస్క్‌ షేర్‌ చేశారు. 

గత ఏప్రిల్‌లో ఎలన్ మ‌స్క్ సారధ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్ర‌యోగించిన అతిపెద్ద రాకెట్ ప్ర‌యోగం విఫ‌ల‌మైన విషయం విదితమే. అమెరికాలోని టెక్సాస్‌ సమీపంలోగల బోకా చీకా తీరం నుంచి  నింగిలోకి ఎగిసిన కొద్దిసేప‌టికే రాకెట్ స్టార్‌షిప్ పేలిపోయింది.ఈ రాకెట్ ప్ర‌యోగం విఫ‌ల‌మ‌మైన నేపధ్యంలో బూస్ట‌ర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయిన‌ట్లు స్పేస్ ఎక్స్ సంస్థ వివరించింది. 

గత ప్రయోగ ఫలితాలను విశ్లేషించి..

అయితే నాడు ఎలన్‌ మస్క్‌ ఒక ట్వీట్‌లో ఈ ‍ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఈ వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. అంతరిక్షంలో వ్యోమగాములు, సరుకు రవాణాకు ఉద్దేశించిన స్టార్‌షిప్‌ ప్రయోగాన్ని గత ఏప్రిల్‌ 17న చేపట్టారు. ఈ ప్రయోగం ప్రారంభ‌మైన మూడు నిమిషాల‌కు బూస్ట‌ర్ విడిపోయి, మెక్సికోలో ప‌డేలా దానిని రూపొందించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ దాదాపు ఒక ప‌రిభ్ర‌మ‌ణం సాగించినా, సాంకేతిక కార‌ణాల‌తో చివ‌రి క్ష‌ణంలో ప్రయోగం వాయిదా ప‌డింది. తరువాతి ప్రయోగంలో ఊహించ‌ని విధంగా స్టార్‌షిప్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో మరోమైలు రాయి దాటినట్లు ఎలన్‌ మస్క్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఇకపై డాక్టర్‌ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు..

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)