Breaking News

‘చచ్చి’ బతికాడు!

Published on Sat, 10/19/2024 - 06:00

అమెరికాలోని కెంటకీలో థామస్‌ హోవర్‌ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్‌ ఓవర్‌డోస్‌ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్‌ హెల్త్‌ రిచ్‌మండ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. 

ఆపరేషన్‌ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. 

కనీసం హూవర్‌ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్‌ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. 

చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్‌ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్‌ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్‌ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)