స్టార్మర్‌ రాజీనామా 

Published on Tue, 06/23/2026 - 04:30

లండన్‌: దశాబ్దకాలంగా తరచూ ప్రధానమంత్రి పదవి నుంచి అగ్రనేతలు వైదొలగుతున్న దృశ్యం మరోసారి బ్రిటన్‌లో కన్పింంచింది. సమర్థవంతమైన పరిపాలన అందించట్లేడంటూ సొంత లేబర్‌ పార్టీ ఎంపీల నుంచే తీవ్రస్థాయిలో ఒత్తిడి నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ తన పదవికి రాజీనామాచేశారు. లేబర్‌ పార్టీ నేత హోదా నుంచీ తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు.

 సెప్టెంబర్‌లో తదుపరి ప్రధాన మంత్రిని ఎన్నుకునేదాకా తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని 63 ఏళ్ల స్టార్మర్‌ వెల్లడించారు. త్వరలో కొలువుతీరే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు, సంపూర్ణ సహకారం కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. గత వారం బ్రిటన్‌ పార్లమెంట్‌ దిగువ సభ(హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) నియోజకవర్గం మేకర్‌ఫీల్డ్‌ ఉపఎన్నికల్లో గెలిచిన సొంత పార్టీ ముఖ్యనేత ఆండీ బర్న్‌హామ్‌ ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు యూకే మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

 ‘‘తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తా’’అని బర్న్‌హామ్‌ చేసిన ప్రకటన ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. రాజీనామాకు ముందే స్టార్మర్‌ సోమవారం ఉదయం బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3తో భేటీ అయి తన రాజీనామా అంశాన్ని వెల్లడించారు. రాజీనామా చేశాక లండన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ భవనం నుంచి స్టార్మర్‌ బయటికొచ్చి మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికలకు నేను పార్టీకి సారథ్యం వహించవచ్చా? అని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించా. అందుకు వాళ్ల నుంచి సమాధానం వచ్చింది. 

అయితే నేను అమితంగా ఇష్టపడే దేశం మరింతగా ముందడుగేసేందుకే ప్రతి నిర్ణయం తీసుకున్నా. అందుకే ఇప్పుడు కూడా దేశం కోసం రాజీనామా చేస్తున్నా’’అని అన్నారు. ‘‘పార్లమెంట్‌ సెప్టెంబర్‌లో సమావేశమయ్యేలోపు కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. అందుకు నా వంతుగా సాయపడతా. సవాళ్లను ఎదుర్కొనే నేతను బ్రిటన్‌ ఎన్నుకోబోతోంది. మా పార్టీ మరింత మెరుగ్గా పరిపాలించబోతోంది. ఇక దేశంలో అతిపెద్ద బాధ్యత(ప్రధాని పదవి) నుంచి తప్పుకుంటున్న నేను ఇకపై మంచి భర్తగా ఉంటా. భార్య నాకు అన్ని వేళలా కష్టసుఖాల్లో తోడుగా నిలబడింది. నా కన్నబిడ్డలకు మంచి తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తా. వీళ్లే నాకు గర్వకారణం, ఆనందం’’అని స్టార్మర్‌ గద్గద స్వరంతో మాట్లాడారు.  

ఎంతో సాధించా 
‘‘ప్రధానిగా నా రెండేళ్ల కాలంలో బ్రిటన్‌ ఎంతో సాధించింది. ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమైంది. ప్రతి నెలా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా అంతకంటే ఎక్కువగా జీతభత్యాలను పెంచి ధరల సమస్యను విజయవంతంగా అధిగమించాం. పెట్టుబడులను పెంచాం. మౌలికవసతులను విస్తరించాం. నా లేబర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చింది. చెప్పిన మార్పులను చేసి చూపించింది. ఆరేళ్ల క్రితం ప్రత్యర్థి పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా ఘోరంగా విఫలమైంది. 

అందుకే వాళ్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో 174 స్థానాలకు పరిమితమయ్యారు’’అని స్టార్మర్‌ తన ఘనతను చెప్పుకున్నారు. బ్రిటన్‌లో గత పదేళ్లలో స్టార్మర్‌తో కలిసి ఆరుగురు ప్రధానులు మారారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్న తన ఆప్తుడు పీటర్‌ మాండెల్సన్‌ను అమెరికాలో బ్రిటన్‌ రాయబారిగా నియమించడం, సంక్షేమ సంస్కరణలు దెబ్బకొట్టడం, అధిక ధరలు, ట్యాక్స్‌లతో స్టార్మర్‌ ప్రభుత్వంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎక్కువైంది. దీంతో పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిళ్లు పెరగడం తెల్సిందే.  

తర్వాత ఏమి జరగొచ్చు? 
గ్రేటర్‌ మాంచెస్టర్‌ మాజీ మేయర్‌ ఆండీ బర్న్‌హామ్‌ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ పేలవ ప్రదర్శనతో పార్టీని స్టార్మర్‌ నడిపించే తీరుపై అభ్యంతరాలు పెరిగాయి. ఇదే సమయంలో ఉత్తర ఇంగ్లండ్‌లో ఉప ఎన్నికల్లో గెలిచిన 56 ఏళ్ల బర్న్‌హామ్‌ నాయకత్వంపై ఆశలు చిగురించాయి. స్టార్మర్‌ రాజీనామాతో జూలై 9వ తేదీ నుంచి పార్టీలో తదుపరి నేత, ప్రధాని పదవుల కోసం నామినేషన్ల ప్రక్రియ ఆరంభంకానుంది. జూలై 17వ తేదీలోపు పార్టీలోని నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(ఎన్‌ఈసీ) ఈ ప్రక్రియను పూర్తిచేస్తుంది. అయితే జూలై మూడో వారంలోపే బర్న్‌హామ్‌ను ఏకగ్రీవంగా పార్టీ నేతగా ఎన్నుకునే ఆస్కారముంది. 

అయితే గతంలో లేబర్‌ పార్టీ ఉపనేతగా సేవలందించిన ఏంజెలా రేర్, బర్మింగ్‌హామ్‌ సెలీ ఎంపీ అల్‌ కార్న్‌ సైతం పోటీలో ఉన్నారు. నామినేషన్‌ను సుస్థిరపర్చుకోవాలంటే పార్టీ సభ్యుల్లో కనీసం 5 శాతం, అంటే పార్లమెంట్‌ దిగువసభలో కనీసం 81 మంది ఎంపీలు ఒక అభ్యర్థికి మద్దతు పలకాలి. లేదా ఆ అభ్యర్థికి కనీసం మూడు పార్టీ అనుబంధ సంస్థలు/కార్మీక సంఘాలు/సహకార సంఘాల మద్దతు తెలపాల్సి ఉంటుంది. అయితే పార్టీలో బర్న్‌హామ్‌కు ఇప్పటికే 300 మంది ఎంపీల మద్దతు ఉండటంతో ఆయన ఎంపిక నల్లేరుపై నడక అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులకు ఓటేసేందుకు అర్హులైన సభ్యులు లేదా అనుబంధ సంస్థల సభ్యులు ఎలక్టోరల్‌ విధానంలో ఓట్లేస్తారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన నేతనే ప్రధాని పదవికి అర్హుడవుతారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)