Breaking News

#KatyTrudeau: స్నేహమా? రొమాంటిక్‌ రిలేషనా?

Published on Wed, 07/30/2025 - 11:09

కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లోబల్ పాప్ స్టార్‌ కేటీ పెర్రీ(40)తో సన్నిహితంగా ఉంటూ కనిపించారాయన. రెండురోజుల వ్యవధిలో.. రెండుసార్లు జంటగానే వాళ్లు కెమెరాకు చిక్కారు. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. 

కెనడా (Canada) ప్రధాని పదవి నుంచి ట్రూడో జనవరిలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన మీడియా కంట పడుతోంది చాలా తక్కువే. మరోవైపు.. తన కొత్త ఆల్బమ్‌ 143 ప్రమోషన్స్‌ కోసం పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో.. 

వీరిద్దరూ మాంట్రియల్‌లో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. తాజాగా.. జులై 28వ తేదీన ఈ జంట ప్రైవేట్‌ డిన్నర్‌కు వెళ్లింది. ప్రైవేట్‌ కార్నర్‌ టేబుల్‌ వద్ద కూర్చొని వీరిరువురూ విందు ఆరగించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంత సమయం మాట్లాడుకున్నారు. ఆపై రెస్టారెంట్‌లోని కిచెన్‌ను పరిశీలించి సిబ్బందికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి.. సమీపంలోని ఓ బార్‌లోనూ ఈ ఇద్దరూ కనిపించారు. ఆ టైంలో వీరు కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. 

ఆ మరుసటిరోజు.. మౌంట్‌ రాయల్‌ పార్క్‌లో గంటకు పైగా జంటగా వాకింగ్‌ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో ట్రూడో, పెర్రీలు డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని ట్రూడో, పెర్రీ తరఫున ఎవరూ ఖండించలేదు. 

ట్రూడో(53) తన సతీమణి సోఫీ గ్రెగోయిర్‌తో 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తమ వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ఈ విషయం వెల్లడించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అటు పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండ్‌ బ్లూమ్‌తో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె ఉంది.వీళ్లది స్నేహమా? లేదంటే రొమాంటిక్‌ రిలేషనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)