బైడెన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా: కమల

Published on Tue, 08/20/2024 - 07:19

న్యూయార్క్‌: తాను జీవితాంతం అధ్యక్షుడు జో బైడెన్‌కు రుణపడి ఉంటానని అమెరికా అధ్యక్ష ఎన్నిక డెమొక్రాటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యలో చికాగోలో నాలుగు రోజుల పాటు జరనున్న డెమోక్రటిక్‌ పార్టీ నేషనల్ కన్వెన్షన్ సమావేశాల్లో తొలిరోజు కమల మాట్లాడారు. అమెరికాకు జీవితకాలం సేవ చేసినందుకు జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

‘మీ (జో బైడెన్‌) నేతృత్వంలో ఈ సమావేశాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ చారిత్రాత్మక నాయకత్వం, అమెరికాకు జీవితకాలం మీరు సేవ చేసినందుకు ధన్యవాదాలు. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అమెరికాలోని నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారందరి తరఫున వచ్చే నవంబర్‌లో మేమంతా ఒకే గళాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి నుంచి మనమంతా ఒక్కటే  గుర్తు చేసుకుందాం. పోరాడినప్పుడు మనమే విజయం  సాధిస్తాం’ అని అన్నారు.

 

నాలుగు రోజుల పాటు జగిగే ఈ  సమావేశాల్లో చిరవరి రోజు (ఆగస్ట్ 22) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున కమలా హారిస్, ఆమె రన్నింగ్‌మేట్‌ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను అధ్యక్షుడు, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా డెమొక్రాటిక్‌ పార్టీ నామినేట్ చేయనుంది. అధ్యక్షడు జో బైడెన్‌.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తన డిప్యూటీ (కమల) సమర్థిస్తూ ప్రారంభ ప్రసంగంలో మాట్లాడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)