Breaking News

సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్‌

Published on Tue, 10/15/2024 - 06:08

వాషింగ్టన్‌: మిల్టన్, హెలెన్‌ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్‌ మండిపడ్డారు. నార్త్‌ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్‌ సెంటర్‌లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు.

 కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్‌ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్‌.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. 

చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై హారిస్‌ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్‌ ప్రసంగానికి ముందు బైడెన్‌ గల్ఫ్‌ తీరంలోని టంపా, సెయింట్‌ పీట్‌ బీచ్‌ మధ్య హెలికాప్టర్‌లో హరికేన్‌ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్‌ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్‌ రెస్పాండర్లను బైడెన్‌ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి.   
 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)