Breaking News

ఇజ్రాయెల్‌ అమానుషం.. నెతన్యాహుపై జో బైడెన్‌ సీరియస్‌

Published on Sun, 03/10/2024 - 08:05

వాషింగ్టన్‌: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో విషయంలో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహు తీరుపై బైడెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కాగా, గాజాలో కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్‌ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న జో బైడెన్‌.. బెంజమిన్‌ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగం తర్వాత సెనెటర్‌ మైకెల్‌ బెన్నెట్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తదితరులతో బైడెన్‌ మాట్లాడారు. 

ఈ సందర్భంగా గాజాలో మానవ సంక్షోభంపై బెన్నెట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బైడెన్‌ సమాధానమిస్తూ.. గాజా విషయంలో నెతన్యాహుతో ముందుగానే చెప్పినట్టు తెలిపారు. అలాగే, గాజాలో మానవ సంక్షోభాన్ని నివారించడానికి నెతన్యాహు చేయాల్సినంత చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌కు సహాయం చేసే దాని కన్నా ఆదేశ ప్రజలను బాధపెట్టేలా ఉందన్నారు. నెతన్యాహుకు ఇజ్రాయెల్‌ను కాపాడే హక్కు ఉంది. ఇదే సమయంలో ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

ఇదిలాఉండగా.. కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 30వేలకుపైగా ప్రజలు మరణించారు. వీరిలో ఎ​క్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మరోవైపు.. హమాస్‌ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో 1200 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఇక, ఇజ్రాయెల్‌ నుంచి హమాస్‌ దాదాపు 250 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో 99 మంది గాజాలో సజీవంగా ఉన్నట్టు ఇజ్రాయెల్‌ అధికారులు చెబుతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)