Breaking News

అధ్యక్ష రేసులో కొనసాగుతా.. ట్రంప్‌ను ఓడించే వ్యక్తిని నేనే: జో బైడెన్‌

Published on Mon, 07/08/2024 - 21:21

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా తాను ఎట్టిపరిస్థితుల్లో తప్పుకోబోనని మరోసారి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ తేల్చిచెప్పారు. అయితే జూన్‌ 27న జరిగిన అధ్యక్ష ఎన్నికల  తొలి డిబేట్‌లో డిమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌.. రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారు. 

ఆయన వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారని దేశాన్ని ట్రంప్‌ నుంచి కాపాడాలంటే అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ తప్పుకోవాలని సొంతపార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖానించటం గమనార్హం. అయితే తాజగా ఆయన మరోసారి స్పందిస్తూ ప్రెసిడెంట్‌ రేసు నుంచి  వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. 

‘‘నేను 2024 నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడించే సమర్థమైన వ్యక్తిని. నేను ప్రెసిడెంట్ రేసులోనే ఉంటాను. ప్రత్యర్థి రిపబ్లిక్  అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో తలపడతాను’’అని స్పష్టం చేశారు.  ఈ మేరకు ఆయన డెమోక్రాట్లకు ఓ లేఖ విడుదల చేశారు.

జూన్‌ 27 నాటి తొలి డిబేట్‌లో జోబైడెన్ తూలటం, మాట్లాడుతూ తడబడటం, వృద్దాప్యంతో ఆలోచన సరళీ అదుపుతప్పటం స్పష్టంగా కనిపించింది. ఇక.. అప్పటి నుంచి  ఆయన అధ్యక్ష రేసు నుంచి దూరంగా ఉంటే బాగుం‍టుందని పలువురు సూచించారు. కాగా, బైడెన్‌ తప్పుకుంటే  ఉపాధ్యక్షురాల కమలా హారిస్ ప్రెసిడెంట్‌ ఎన్నికల బరిలో దిగుతారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు.. జో బైడెన్‌ గత పదిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు, డెమోక్రటిక్‌ నేతల మద్దతూ కూడగట్టుకుంటున్నారు.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి