Breaking News

కమలా హారీస్‌పై నమ్మకముంది: బైడెన్‌ సతీమణి జిల్‌

Published on Thu, 07/25/2024 - 08:07

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ రావడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో కమలా హారీస్‌ విజయం సాధిస్తుందనే నమ్మకంతో డెమోక్రాట్స్‌ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌.. కమలా హారీస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చిందంటూ జిల్‌ బైడెన్‌ చెప్పుకొచ్చారు.

కాగా, అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్‌ బైడెన్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా జిల్‌ బైడెన్‌..‘మమ్మల్ని విశ్వసించిన వారికి నా కృతజ్ఞతలు. మీరు ఇన్ని రోజులు జో బైడెన్‌పై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మాపై మీ అభిమానం ఎల్లప్పుడూ నా హృదయంలో నిండి ఉంటుంది. ఇప్పుడు కమలా హారీస్‌పై ఆ నమ్మకాన్ని ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆమెపై నాకు నమ్మకముంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ఇక, తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని జో బైడెన్‌ చెప్పుకొచ్చారు. తాజాగా జో బైడెన్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఉన్న  ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే  పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. అలాగే, అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి.  ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో​ పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)