Breaking News

వాంగా చెప్పినట్టే ..ఐతే కొంచెం లేటుగా!

Published on Thu, 07/31/2025 - 04:26

అవును. ఆమె చెప్పిందే జరిగింది. జపనీస్‌ బాబా వాంగా పేరిట ఫేమస్‌ అయిన మాంగా ఆర్టిస్ట్‌ రియో తత్సుకి చెప్పింది అక్షరాలా నిజమైంది. జపా న్‌ తీరాలను పెద్ద సునామీ తాకింది. ఆమె చెప్పిన తేదీన కాకపోయినా మొత్తానికైతే ఘటన జరగనే జరిగింది. జపాన్‌ తీరాన్ని జులై 5న సునామీ ముంచెత్తుతుందని చెప్పగా ఆ ఉత్పాతం జూలైæ 30న ముంచుకొచ్చింది. దాంతో మాంగా పేరు సోషల్‌ మీడియాలో మరోసారి మారుమోగుతోంది. 
ఎవరీ రియో తత్సుకి?
తత్సుకి సాధారణ మాంగా ఆర్టిస్ట్‌ కాదు. ఆమె కలల మధ్య నడిచిన సత్యమని చెబితే అతిశయోక్తేమీ కాదు. ‘ద ఫ్యూచర్‌ దట్‌ ఐ సా (నేను చూసిన భవిష్యత్తు)’ పేరిట 1990 దశాబ్దం చివరలో ఆమె ఓ పుస్తకం రాసింది! ఆ పుస్తకంలో తాను నిద్రలో చూసిన కలల్ని కథలుగా మార్చింది. అప్పట్లో దాన్నెవరూ పట్టించుకోలేదు. కామిక్‌ పుస్తకంగా భావించారు. 2011 మార్చిలో భారీ విపత్తు వస్తుందని పుస్తకంపై ఓ మాట ఉంది. అన్నట్టుగానే అదే నెలలో జపాన్‌ను భూకంపం, సునామీ వణికించాయి. దాంతో అంతా షాకయ్యారు. 

ఆ ఘటన తర్వాత ఆమెకు భవిష్యద్దర్శన శక్తి ఉందని కొందరు నమ్మడం మొదలుపెట్టారు. తత్సుకి కలలు ఇప్పుడు మరోసారి ప్రజలను భయపెడుతున్నాయి. ఆ పుస్తకానికి 2021లో మరో ఎడిషన్‌ తీసుకొచ్చిందామె. అందులో ఓ కొత్త తేదీ వేసింది. అదే 2025 జూలై 5. ఆ రోజు ఫిలిప్పైన్స్‌ సముద్రంలో భారీ విస్ఫోటనం జరగబోతుందని, సముద్రం ఉప్పొంగిబోతుందని, వరుస భూకంపాలు రావొచ్చని చెప్పింది. 2011 సునామీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రళయం రావచ్చంటూ డ్రాయింగ్‌ వేసింది. అంతటి ఉత్పాతం జరగకపోయినా అదే నెలలో జపాన్‌ను సునామీ వణికించింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)