Breaking News

గ్లాసు వైన్‌ 5 లక్షల డాలర్లు!

Published on Mon, 12/16/2024 - 05:37

అవున్నిజమే! మన రూపాయల్లో కోటి 24 లక్షల రూపాయల పైమాటే. అంత ఖరీదెందుకు, ఏమిటా వైన్‌ ప్రత్యేకత వంటి సందేహాలెన్నో వస్తున్నాయి కదా! ఆ వైన్‌ అంతరిక్ష కేంద్రంలో తయారవుతోంది మరి! ఇదంతా జపాన్‌కు చెందిన ప్రముఖ సేక్‌ (వైన్‌) బ్రాండ్‌ దస్సాయ్‌ తయారీ సంస్థ అసాహి షుజో ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది. ముడి పదార్థాలను ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పంపించి అక్కడ పులియబెట్టాలని యోచిస్తోంది.

 ఇది విజయవంతమైన మీదట కేవలం 100 మి.లీ. వైన్‌ బాటిల్‌ను ఏకంగా రూ.5.53 కోట్లకు అమ్మనుంది. ఈ ప్రయోగానికి జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీకి కంపెనీ భారీ మొత్తమే చెల్లించింది. ఈ ప్రాజెక్టును 2025లో లాంచ్‌ చేయనుంది. అంతరిక్షంలో పులియబెట్టేందుకు కావాల్సిన పరికరాల తయారీలో బిజీగా ఉంది. అయితే గురుత్వాకర్షణ ఉండని అంతరిక్ష కేంద్రంలో పులియడానికి కావాల్సిన కిణ్వ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది చూడాలి. 

చంద్రుడే లక్ష్యంగా..  
ప్రయోగం గనుక సక్సెసైతే ఇదే అతి ఖరీదైన పానీయం అవుతుందని అసాహి షుజో కంపెనీ బ్రూవర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌చార్జి  సౌయా ఉట్సుకి చెప్పారు. ‘‘అయితే ఈ పరీక్ష 100% విజయవంతమవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే మా ప్రయత్నం వెనుక కేవలం ఘనత కోసం కాదు. అంతరిక్షంలో కిణ్వ ప్రక్రియ ఏ మేరకు జరుగుతుందన్న దానిపై మా కంపెనీ దృష్టి పెట్టింది. జరిగితే ఏదో ఒకనాడు చంద్రుడిపైనా వైన్‌ను పులియబెట్టడం మా కంపెనీ లక్ష్యం.

 మున్ముందు మనుషులు చంద్రుడిపైకి స్వేచ్ఛగా ప్రయాణించే రోజు రానుంది. పర్యాటకులు చంద్రునిపై ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదించాలన్నది మా ఉద్దేశం. అంతేగాక పులియబెట్టిన ఆహారాన్ని ఇష్టపడే భావి అంతరిక్ష పర్యాటకులకు కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటో, మిసో వంటి జపనీస్‌ ఆహారాలు పులియబెట్టడం ద్వారానే తయారవుతాయి. 

ఏమిటీ సేక్‌? 
సేక్‌ ఒక రకమైన వైన్‌ లేదా సారాయి. జపనీస్‌ బియ్యం, నీరు, ఈస్ట్, కోజీ (ఒక రకమైన అచ్చు) తో తయారవుతుంది. నిర్దిష్ట సమయాల్లో పలు దశల్లో ఆవిరి పట్టడం, కదిలించడం, పులియబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. అందుకు 2 నెలలు పడుతుంది. ఇది జపాన్‌ సాంస్కృతిక వారసత్వ పానీయంగా యునెస్కో గుర్తింపు పొందింది. సేక్‌ బ్రాండ్లలో దస్సాయ్‌ అత్యంత ప్రాచుర్యం పొందింది. 

– వాషింగ్టన్‌   

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)