పునర్వినియోగ రాకెట్‌... జపాన్‌ తొలి పరీక్ష సక్సెస్‌ 

Published on Sun, 07/12/2026 - 06:26

టోక్యో: ఆసియా దేశాలు పునర్వినియోగ రాకెట్లను పోటాపోటీగా అభివృద్ధి చేస్తున్నాయి. చైనా ఈ దిశగా ఒక ప్రయోగాన్ని విజయవంతం చేసి 24 గంటలు కూడా గడవక ముందే జపాన్‌ కూడా తొలి పరీక్షలో సక్సెస్‌ నమోదు చేసింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించుకునేందుకు ఈ రంగంలో స్పేస్‌ ఎక్స్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకూ పునర్వినియోగ రాకెట్లు ఉపయోగపడతాయని జపాన్‌ అంచనా. 

ఆర్‌వీ–ఎక్స్‌ పేరుతో జపాన్‌ అభివృద్ధి చేసిన పునర్వినియోగ రాకెట్‌ శనివారం ఒకే ఒక్క నిమిషం పాటు గాల్లోకి ఎగిరి కొంత పక్కకు జరిగి ల్యాండైంది. జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీకి సంబంధించిన నోషిరో టెస్టింగ్‌ సెంటర్‌లో జరిగిన ఈ ప్రయోగాన్ని ఎన్‌వీఎస్‌ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం.  జపాన్‌ అంతరిక్ష ప్రయోగాలకు చాలా కాలంగా ఒకేసారి వాడగలిగే హెచ్‌–3 శ్రేణి రాకెట్లను వాడుతున్న విషయం తెలిసిందే. 

అంతకంటే మునుపు వాడిన హెచ్‌2ఏ శ్రేణి రాకెట్ల కంటే ఇది చౌక అయినప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల మార్కెట్‌లో పోటీకి ఖర్చులు మరింత తగ్గాల్సి ఉంటుంది. జాతీయ భద్రతకు ఇది అత్యవసరమని జపాన్‌ భావిస్తోంది. జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా, మిత్సుబుషి హెవీ ఇండస్ట్రీస్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఆర్‌వీ–ఎక్స్‌ రాకెట్‌ సుమారు 23.9 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వ్యాసం కలిగి ఉంది. అత్యాధునిక ఇంజిన్లు, నాలుగు షాక్‌ అబ్జార్బర్లతో కూడిన ల్యాండింగ్‌ గేర్‌ దీని ప్రత్యేకతలు. పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో జాక్సా ఫ్రాన్స్, జర్మనీల సాయం కూడా తీసుకుంటోంది.  

 

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)