Breaking News

బతికించిన సూరీడు.. ‘మూన్ స్నైపర్’ ఈజ్ బ్యాక్!

Published on Mon, 01/29/2024 - 21:41

నిద్ర లేస్తూనే చకచకా పని ఆరంభించిన జపాన్ ల్యాండర్. చంద్రుడిపై దిగిన తమ ‘స్లిమ్’ ల్యాండరుతో ఆదివారం సాయంత్రం సమాచార సంబంధాలను పునరుద్ధరించినట్టు సోమవారం ‘ఎక్స్’ (పాత పేరు ట్విట్టర్) వేదికగా ప్రకటించిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’. ల్యాండరులోని మల్టీబ్యాండ్ స్పెక్ట్రోస్కోపిక్ కెమెరా (ఎంబీసీ)తో వెంటనే శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించినట్టు ఆ సంస్థ తెలిపింది. ల్యాండర్ దిగిన ప్రదేశంలో కుక్క బొమ్మ (టాయ్ పూడిల్)ను పోలివున్న ఓ చంద్రశిల ఛాయాచిత్రాన్ని రోవర్-2 (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఫొటో తీసింది.

ల్యాండర్, దాని సమీపంలోని ఆ శిల  ఛాయాచిత్రాన్ని ఎక్స్ వేదికగా ‘జాక్సా’ పోస్ట్ చేసింది. ‘మూన్ స్నైపర్’ ఈ నెల 19న చంద్రుడిపై షియోలి బిలంలోని వాలులో తలకిందులుగా దిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా ‘మూన్ స్నైపర్’ సౌరఫలకాలు సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండిపోవటంతో ల్యాండరులోని ఆన్బోర్డ్ బ్యాటరీని రెండున్నర గంటలు మాత్రమే వినియోగించి, 12% పవర్ ను ముందుజాగ్రత్తగా నిల్వ ఉంచి దాన్ని ‘జాక్సా’ స్విచ్ ఆఫ్ చేసింది.

ల్యాండరులోని సాంకేతిక సమస్యను అధిగమించామని, సూర్యుడి కోణం మారి ప్రస్తుతం ఎండ అందుబాటులోకి రావడంతో ల్యాండర్ సౌరఘటాలు పనిచేస్తున్నాయని ‘జాక్సా’ వివరించింది. చంద్రుడి బిలంలో ల్యాండర్ డొల్లిపోయి తలకిందులుగా దిగినా, దాని సోలార్ ప్యానెళ్లు పై భాగంలో కాకుండా కిందివైపు... అదీ వెనుకవైపున సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్నా... తాజాగా సూర్యరశ్మిని గ్రహించి అవి పనిచేయడం మొదలుపెట్టడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. ల్యాండర్ తలకిందులైనా దాని జాతకం తిరగబడి అది తుది ఘట్టంలో కుదురుకోవడం ఆశ్చర్యకర పరిణామం.

ఈ విషయంలో జపాన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు చాలా అదృష్టవంతులు. చంద్రశిలల నిర్మాణ కూర్పును ల్యాండర్ అధ్యయనం చేయనుంది. చంద్రుడిపై ల్యాండర్ ఎప్పటివరకు పనిచేస్తుందో ‘జాక్సా’ వెల్లడించలేదు. అయితే... జాబిలిపై రాత్రివేళల్లో నమోదయ్యే మైనస్ డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేయలేదు. చంద్రుడిపై 15 రోజులపాటు పగలు, 15 రోజులపాటు రాత్రి ఉంటాయి. అలా చూస్తే... గరిష్ఠంగా మరో 3-4 రోజులు మాత్రమే బహుశా ల్యాండర్ పనిచేయవచ్చు. 
:::: జమ్ముల శ్రీకాంత్

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)