Breaking News

జ‌పాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ

Published on Sun, 11/09/2025 - 17:44

టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం సంభవించిన  భారీ భూకంపం ఆ దేశవ్యాప్తంగా భయాందోళనకు కారణమైంది. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం తూర్పు తీర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. జపాన్ వాతావరణ శాఖ (JMA) ప్రకారం, భూకంప కేంద్రం హోక్కైడో ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్టానికి దిగువన నమోదైంది.

భూకంపం అనంతరం జపాన్ వాతావరణ శాఖ తూర్పు తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలను తక్షణమే లతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

భూకంపం ప్రభావంతో హోక్కైడో, టోహోకు, మియాగి వంటి ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రాణ నష్టం, ఆస్తినష్టంపై అధికార సమాచారం లేదు. అయితే, పలు రైలు సేవలు నిలిచిపోయాయి.  విమానయాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూకంపం తీవ్రతతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. ప్రజలకు అవసరమైన సహాయం అందించింది.  

జపాన్‌ వాతావరణ శాఖ ప్రకారం.. సముద్ర మట్టానికి దగ్గరగా భూకంప కేంద్రం ఉండటంతో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 1 మీటరు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. ఈ భూకంపంపై యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) కూడా స్పందించింది. భూకంప తీవ్రతను ధృవీకరించిన యూఎస్‌జీఎస్‌, భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు. జపాన్‌ వంటి భూకంప ప్రభావిత దేశాల్లో ఇటువంటి ప్రకృతి విపత్తులకు ముందస్తు చర్యలు తీసుకోవడం సాధారణమే అయినా, ఈ స్థాయి తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)