Breaking News

ఇకపై డాక్టర్‌ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. ట్రైల్‌ సేల్స్‌కు అనుమతి!

Published on Tue, 06/27/2023 - 10:25

జపాన్‌ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇకపై దేశంలో డాక్టర్‌ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు విక్రయించేందుకు అనుమతినిచ్చింది. అయితే ముందుగా వీటిని ట్రయల్‌ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. అత్యవసర గర్భనిరోధక మాత్రల విషయమై జపాన్‌లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకూ ఉన్న నియమం ఇదే..
జపాన్‌ ఆరోగ్యశాఖ తాజాగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు ‘మార్నింగ్‌ ఆఫ్టర్‌ పిల్స్‌’ విక్రయాలకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ వీటిని కొనుగోలు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా మహిళ, లేదా అత్యాచార బాధితురాలు ఈ మాత్రలను కొనుగోలు చేయాలంటే, తప్పనిసరిగా అందుకు సంబంధించిన డాక్టర్‌ చీటీ చూపించడం తప్పనిసరి.

ఆరేళ్ల క్రితం రాజుకున్న వివాదం
2017లో ఎటువంటి డాక్టర్‌ చీటీ లేకుండా గర్భనిరోధర మాత్రలు విక్రయించడంపై వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో జపాన్‌ ప్రభుత్వం కొద్దిపాటి సడలింపుతో డాక్టర్‌ చీటీ లేకుండా వీటి విక్రయాలకు అనుమతినిచ్చింది. అయితే ‘మార్నింగ్‌ ఆఫ్టర్‌ పిల్స్‌’ మార్కెట్‌లో సులభంగా అందుబాటులో ఉంచడం తగినది కాదనే వాదన కొందరిలో మొదలయ్యింది. దీనివలన సమస్యలు పెరుగుతాయిని వారు పేర్కొన్నారు.

90వ దశాబ్ధంలో సులభంగా లభ్యం
90వ దశాబ్ధంలో జపాన్‌లో గర్భనిరోధక మాత్రలు డాక్టర్‌ చీటీ లేకుండానే విక్రయించేవారు. అయితే పలు పరిశోధనల్లో అత్యవసర గర్భనిరోధక మాత్రలతో ముప్పు పొంచి ఉన్నదని వెల్లడయ్యింది. 

46 వేల మంది వినతి మేరకు..
2020 చివరిలో లింగసమానత్వానికి జాపాన్‌ క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ నేపధ్యంలో మరోమారు అత్యవసర గర్భనిరోధక మాత్రల విక్రయాలపై తిరిగి వాదనలు మొదలయ్యాయి. తాజాగా వీటి విక్రయాలపై ప్రభుత్వానికి 46,312 మంది సలహాలు, సూచనలు అందించారు. వీరిలో చాలామంది గర్భనిరోధక మాత్రలను ట్రయల్‌​ రూపంలో విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి..

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)