Breaking News

భారీ తారల... రుజువులు చిక్కాయి

Published on Thu, 12/11/2025 - 05:58

భారీ తారలు. మన సూర్యుని కంటే ఏకంగా పది వేల రెట్లు పెద్దవి! పైగా నిన్నా మొన్నటికి కూడా కావవి! తొలి విస్ఫోటం (బిగ్‌ బ్యాంగ్‌) జరిగిన కొన్ని కోట్ల ఏళ్ల వ్యవధిలోనే పుట్టుకొచ్చాయి. అంటే అతి పురాతన నక్షత్రాలన్నమాట. ఇలాంటివి ఈ అనంత విశ్వంలో ఉన్నాయనింతకాలం సైంటిస్టులు అనడమే తప్పించి ఇదమిత్థంగా తేల్చిచెప్‌ దాఖలాలు మాత్రం లేవు. అలాంటి తొలినాళ్ల భారీ తారల ఉనికికి సంబంధించి పక్కా రుజువులను మానవాళి తాలూకు అతి పెద్ద అంతరిక్ష నేత్రం జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాజాగా ఒడిసిపట్టింది..!

దొరికాయిలా...
ఈ భారీ తారలను రాకాసి నక్షత్రాలుగా సైంటిస్టులు ముద్దు పిలుచుకుంటూ ఉంటారు. వాటి పరిమాణే అందుకు కారణం. సూర్యునితో పోలిస్తే అవి కనీసం 1,000 నుంచి 10,000 రెట్లు పెద్దవి మరి! జీఎస్‌ 3073 అనే అతి సుదూర నక్షత్ర మండలంలోని రసా యనిక అవశేషాలను జేమ్స్‌ వెబ్‌ తాజాగా పట్టించింది. వాటిని అనంతరం ఈ రాకాసి తారల ఉనికిని సైంటిస్టులు అసందిగ్ధంగా నిర్ధారించారు.

పురాతన క్రిష్ణ బిలాలకూ మూలమివే
సృష్టి ఆవిర్భావం జరిగిన కొన్ని కోట్ల ఏళ్లకే అతి భారీ కృష్ణ బిలాలు ఊపిరి పోసుకున్నాయి. ఇందుకు ఎన్నో రుజువు కూడా దొరికాయి. అదెలా సాధ్యపడిందీ అనే సందేహా లకు కూడా ఈ తొలినాళ్ల రాకాసి తారల ఉనికితో సమా దానం దొరికినట్టయింది.

ఇలా అధ్యయనం..
తొలి తరల ఉనికి కోసం సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రో ఫిజిక్స్, హార్వర్డ్, స్మిత్సోని యన్, యూనివర్సిటీ ఆఫ్‌ పోర్ట్స్‌ మౌత్‌ సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. ఇందుకో సం తొలుత జీఎస్‌ 3073 నక్షత్ర మండలంలోని నైట్రోజన్‌ – ఆక్సిజన్‌ నిష్పత్తిని అవి లెక్కగట్టి 0.46గా తేల్చాయి. సాధారణ తారలతో కూడిన గెలాక్సీల్లో ఇంతటి నిష్పత్తి అక్షరాలా అసాధ్యం. జీఎస్‌ 3073లో వందలాది కోట్ల ఏళ్ల క్రితమే భారీ, అంటే రాకాసి తారలు మనుగడ సాగించాయని దీన్నిబట్టి వర్సిటీల బృందం తేల్చింది. ‘తొలినాళ్ల రాకాసి తారలు నిజమేనా అని 20 ఏళ్లుగా నెలకొన్న సందిగ్ధానికి ఈ అధ్యయనం తెర దించింది. ఇందుకు సంబంధించిన తొలి పక్క రుజువులు జీఎస్‌ 3073లో చిక్కాయి‘ అని అధ్యయన బృంద సారథి డానియల్‌ వాలెన్‌ హర్షం వెలిబుచ్చారు. వీటిని తొలి తరం తారలుగా ఆయన అభివర్ణించారు. ఈ ఆసక్తికర అధ్యయన ఫలితాలను ఆస్ట్రో ఫిజికల్‌ జర్నల్‌ లెటర్స్‌ లో ప్రచురించారు.

కొసమెరుపు
జీఎస్‌ 3037 గెలాక్సీ కేంద్ర స్థానంలో ప్రస్తుతం సూపర్‌ నోవాలను కూడా తలదన్నే అతి భారీ కృష్ణబిలం ఉందట. అది బహుశా కచ్చితంగా తొలి తరం రాకాసి తార తాలూకు రూపాంతరమే అయి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)