Breaking News

ట్రంప్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషా‘పతి’

Published on Wed, 07/17/2024 - 06:07

ఉషా చిలుకూరి వాన్స్‌.. తెలుగు పేరులా ఉంది కదా! అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశమైన పేరు. రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్‌ డేవిడ్‌ వాన్స్‌ భార్య. కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు.. 

వాషింగ్టన్‌: సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్‌ హాజర­య్యారు. రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్‌గా ఉన్న జేమ్స్‌ డేవిడ్‌ వా న్స్‌ (జేడీ వాన్స్‌)ను ప్రకటించారు. ఒకప్పుడు ట్రంప్‌ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్‌ తరువాత ఆయనకు అనుచరుడిగా మారిపో యారు. ట్రంప్‌పై హత్యాయ త్నం జరిగిన వెంటనే.. దీని వెనుక అధ్యక్షుడు జో బైడెన్‌ పాత్ర ఉండొచ్చని మొట్ట­మొదటగా ట్వీట్‌ చే సింది కూడా జేడీనే. సోమ­వారం జరిగిన కన్వెన్షన్‌లో అభర్థిత్వం ప్రకటించిన త రువా త ప్రసంగించిన ఆయన.. తన ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి వాన్స్‌ సహ కా రం ఎంతో ఉందన్నారు.  

చరిత్ర విద్యార్థిగా..  
ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్‌ అయిన ఉషా.. యేల్‌ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్‌ డిగ్రీ చదివారు. ఉష అక్కడి లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్‌ డెవ లప్‌మెంట్‌ ఎడిటర్‌గా, యేల్‌ జర్నల్‌ ఆఫ్‌ లా అండ్‌ టెక్నాలజీకి మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్‌–వింగ్, లి బరల్‌ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్‌ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 

2015–2017 వరకు శాన్‌ఫ్రాన్సిస్కో వాషింగ్టన్‌ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు. యేల్‌ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్‌ పరిచయం. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్‌ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్‌ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)