Breaking News

‘86 47’ సంకేతం  వెనుక ఏముంది?

Published on Sat, 05/17/2025 - 05:17

వాషింగ్టన్‌: ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) మాజీ బాస్‌ జేమ్స్‌ కొమీ సోషల్‌ మీడియాలో పెట్టిన ‘86 47’సంకేత పోస్ట్‌పై దర్యాప్తు చేపట్టామని హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్‌ గురువారం వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో ఇదో భాగమని భావిస్తున్నట్లు ఆమెతోపాటు పలువురు రిపబ్లిక్‌ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అంతకుముందు కోమీ ఇన్‌స్టా పోస్ట్‌లో ‘బీచ్‌లో నడుస్తుండగా నత్త గుల్లలు ‘86 47’ఆకారంలో కనిపించాయి’అంటూ ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఇందులోని 86ను తొలగించడం, వదిలించుకోవడం అనే అర్థమొచ్చేలా వాడుతారు. 

47ను ట్రంప్‌ను సూచిస్తూ వాడిన రహస్య సంఖ్య. ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడు. మొత్తమ్మీద అధ్యక్షుడిని హత్య చేసేలా ప్రేరేపించడమే దీని వెనుక అర్థమని ట్రంప్‌ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై డీహెచ్‌ఎస్, సీక్రెట్‌ సరీ్వస్‌ దర్యాప్తు చేపట్టి తగు రీతిలో స్పందిస్తాయని నోమ్‌ పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ కూడా తన తండ్రిని చంపాలని పిలుపునిస్తూ కొమీ ఈ పోస్ట్‌ పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని ఎఫ్‌బీఐ చీఫ్, భారత సంతతికి చెందిన కాశ్‌ పటేల్‌ తెలిపారు. 

పశి్చమాసియాలో అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను చంపాలని ఉగ్రవాదులకు ఈ సంకేతం ద్వారా కొమీ ప్రేరేపించారని వైట్‌ హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జేమ్స్‌ బ్లయిర్‌ ఆరోపించారు. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తుల్సి గబ్బార్డ్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఈ పోస్ట్‌ను తీసిపారేయరాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోస్ట్‌. అధ్యక్షుడు ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి’అని ఆమె అన్నారు. ఈ ఆరోపణలపై జేమ్స్‌ కొమీ స్పందించారు. ‘రాజకీయ ఉద్దేశంతో పెట్టిన పోస్ట్‌పై హింసను ప్రేరేపించేలా ఉందంటూ కొందరు విపరీతార్థాలు తీస్తారని నేను ఊహించలేదు. హింసకు నేను పూర్తిగా వ్యతిరేకిని’అంటూ ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. 2013–2017 మధ్య కాలంలో జేమ్స్‌ కొమీ ఎఫ్‌బీఐ చీఫ్‌గా పనిచేశారు.  

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)