Breaking News

చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్‌ భేటీ

Published on Thu, 07/04/2024 - 10:27

అస్తానా: కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకున్నారు. వీరు కరచాలనం చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. భారత్‌-చైనా మధ్య  గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేవు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా వాంగ్ యీని కలవడానికి ముందు జైశంకర్ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కూడా కలుసుకున్నారు.

ఎస్‌సీఓ సమ్మిట్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు వచ్చిన జైశంకర్ తజికిస్తాన్ విదేశాంగ మంత్రి సిరాజుద్దీన్ ముహ్రిద్దీన్‌ను కూడా కలుసుకున్నారు. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో తన పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ప్రపంచ స్థితిపై అతని అంతర్దృష్టిని మెచ్చుకోవాల్సిందే. ప్రపంచ సమస్యలు, వాటి విస్తృత ప్రభావాల గురించి సమావేశంలో చర్చించాం. అలాగే సెప్టెంబరులో జరిగే శిఖరాగ్ర సమావేశ సన్నాహాలు, భారత్‌-యుఎన్ భాగస్వామ్య భవిష్యత్‌ అవకాశాల గురించి కూడా చర్చించామని జైశంకర్‌ తెలిపారు.

గుటెర్రెస్‌ను కలవడానికి ముందు జైశంకర్ తజికిస్తాన్, బెలారస్, రష్యా ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. కాగా ఎస్‌సీఓలో భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు. ప్రస్తుత సమావేశాలను కజకిస్తాన్ నిర్వహిస్తోంది.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)