Breaking News

పాక్‌కు మద్దతివ్వకండి..! జైశంకర్ సూచన

Published on Mon, 01/19/2026 - 17:40

భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పోలాండ్‌కు కీలక సూచన చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి  ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని తెలిపారు. ఉగ్రవాదంపై ఖచ్చితంగా జీరో టోలరెన్స్  విధానాన్ని పాటించాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి జైశంకర్ 
పోలాండ్ ఉపప్రధానితో మాట్లాడారు.

పోలాండ్ విదేశాంగశాఖ మంత్రి రాడోస్లావ్  సిక్రోస్కీ,తో   జైశంకర్ ఈ రోజు ( సోమవారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ఉ‍గ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానాన్ని పాటించాలని ముష్కరులను పెంచి పోషిస్తున్న దేశాలలో  మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఎటువంటి సహాయం చేయకూడదని తెలిపారు.

జైశంకర్ మాట్లాడుతూ.."ఉపప్రధాని మీరు మాకు దూరమైన వ్యక్తి కాదు . మా ప్రాంతంలో జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదంపై మీకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం చర్చించిన అంశం ఇటీవల మీరు పర్యటించిన ఓ దేశానికి సంబందించింది. పోలాండ్ టెర్రరిజానికి మద్దతివ్వకూడదు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టకూడదు" అని అన్నారు.

పోలాండ్ దేశంతో జరిగిన భేటీ అంశాలను తన ఎక్స్‌ ఖాతాలో జైశంకర్ పంచుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలకు పోలాండ్ ఉప ప్రధాని అంగీకారం తెలుపుతున్నట్లుగా తల ఊపారు. పహల్గామ్ అటాక్ అనంతరం పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న అంశాన్ని భారత్ ఈయూ దేశాలకు వివరిస్తూ వస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)