Breaking News

ఇటలీ ప్రధాని, భారత ప్రధాని స్నేహితులైతే..

Published on Sat, 12/02/2023 - 07:12

దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  వివిధ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని కూడా కలిశారు. మెలోని కూడా ప్రధాని మోదీతో సెల్ఫీ దిగి,  దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మేం మంచి స్నేహితులం’ అని రాశారు. అలాగే ‘#మెలోడి’ అని రాసి.. అందులో మెల్ అంటే మెలోనీ అని.. ఓడి అంటే మోదీ అని రాశారు. 

వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. మెలోనితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, బ్రెజిల్ ప్రధాని లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌లను కూడా కలిశారు. 

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సులో నాలుగు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ఇతర నేతలు కలిసి గ్రూప్‌ ఫొటో కూడా దిగారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ లక్ష్యాలను సాధించడంలో భారతదేశం చేపట్టే కార్యక్రమాలు, పురోగతిని ప్రధాని మోదీ వివరించారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్‌లో చేరాలని ప్రపంచ నాయకులను ప్రధాని మోదీ కోరారు. 

కాప్‌-28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కూడా కలిశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాప్‌-28 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాన మంత్రి మోదీ వారిని అభినందించారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌కు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధాని ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)