Breaking News

అల్‌ మవాసీ మానవతా జోన్‌పై ఇజ్రాయెల్‌ దాడి

Published on Wed, 09/11/2024 - 02:06

డెయిర్‌ అల్‌ బలాహ్‌: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ దాడుల పర్వం ఆగడం లేదు. దక్షిణ గాజాలో వలసదారులకు ఆశ్రయం కలి్పస్తున్న మానవతా జోన్‌పై ఇజ్రాయెల్‌ దళాలు సోమవారం జరిపిన దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారులు ప్రకటించారు. ఖాన్‌ యూనిస్‌ పరిధిలోని అల్‌–మవాసీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. అయితే 40 మంది చనిపోయినట్లు తొలుత వార్తలొచ్చాయి. మానవతా జోన్లలో రహస్యంగా పనిచేస్తున్న హమాస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉగ్రవాదులపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. 

క్షిపణి దాడుల్లో 20 గుడారాలు దగ్ధమయ్యాయని, పేలుడు ధాటికి 30 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని గాజా సివిల్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్న గాజా సివిల్‌ డిఫెన్స్‌ సభ్యులు ఇసుకను తవ్వుతున్న దృశ్యాలను హమాస్‌ మీడియా సంస్థ అల్‌ అక్సా టీవీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘‘200 పై చిలుకు నిర్వాసితుల గుడారాల్లో 20 ధ్వంసమయ్యాయి. వాటిలో ఉంటున్న కుటుంబాలు అదృశ్యమయ్యాయి’’ అని గాజా సివిల్‌ డిఫెన్స్‌ అధికార ప్రతినిధి మహమూద్‌ బస్సాల్‌ చెప్పారు. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఇప్పటికీ దాడులు ఆపడం లేదని శరణార్థులు వాపోయారు. దాడి జరిగిన చోట తమ వాళ్లెవరూ లేరని హమాస్‌ పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)