Breaking News

పేరు వేరే అయినా.. పేజర్‌ వీళ్లదే

Published on Fri, 09/20/2024 - 05:00

లెబనాన్‌లో వేలాది పేజర్‌లు ఒకే సమయంలో పేలి వేలాది మందిని గాయపరిచి, కొందరి ప్రాణాలు తీసిన ఘటనలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. పేలిన పేజర్‌లను హంగేరీలోని ఒక సంస్థకు హెజ్‌బొల్లా, లెబనాన్‌ సైన్యం ఆర్డర్‌ ఇవ్వగా వాటిలో స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాన్ని అమర్చి సరఫరా చేశారని గత రెండ్రోజులుగా వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ పేజర్‌లను తయారుచేసిన సంస్థ ఇజ్రాయెల్‌కు చెందిన డొల్ల కంపెనీ అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. హంగేరీలో పేరులో ‘బీఏసీ’ అక్షరాలుండే కంపెనీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. 

వీటి పోలికలతో ‘బీఏసీ కన్సల్టింగ్‌ కేఎఫ్‌టీ’ పేరిట ఒక నకిలీ కంపెనీని ఇజ్రాయెల్‌ స్థాపించింది. పేజర్‌లను అది తయారుచేస్తుంది. హెజ్‌బొల్లా సభ్యులకు పేలుడు పదార్థమున్న పేజర్‌లను సరఫరా చేసి వారిని అంతంచేయడమే ఈ కంపెనీ లక్ష్యం. ఇందుకోసం ముగ్గురు ఇజ్రాయెల్‌ నిఘా విభాగ అధికారులు ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. లెబనాన్‌ నుంచి పేజర్‌ల సరఫరా కాంట్రాక్ట్‌ సంపాదించేందుకు ఇజ్రాయెల్‌ చాన్నాళ్ల క్రితమే మూడు డొల్ల కంపెనీలను ఏర్పాటుచేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. 

ఈ మూడు కంపెనీల్లో ఒకటైన బీఏసీ కన్సల్టింగ్‌ కేఎఫ్‌టీ హంగేరీలోని బుడాపెస్ట్‌ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు, ఇజ్రాయెల్‌కు సంబంధం ఉంటుందని హెజ్‌బొల్లా అస్సలు ఊహించలేదు. ఎలాంటి అనుమానం రాకపోవడంతో బీఏసీ కన్సల్టింగ్‌ సంస్థకే హెజ్‌బొల్లా పేజర్ల సరఫరా ఆర్డర్‌ ఇచ్చిందని ఇరాన్‌లోని మెహర్‌ న్యూస్‌ఏజెన్సీ వివరించింది. బీఏసీ కన్సల్టింగ్‌ గత మూడేళ్లుగా తైవాన్‌కు చెందిన గోల్డ్‌ అపోలో బ్రాండ్‌తో పేజర్లు తయారుచేసి విక్రయిస్తోంది. దీంతో హెజ్‌బొల్లా నుంచి చాలా సులువుగా బీఏసీ సంస్థ ఆర్డర్‌ సాధించగల్గిందని మెహర్‌ తన కథనంలో పేర్కొంది. అందుకే యూరప్‌ దేశానికి చెందిన పేజర్‌లు పేలితే తనకేం సంబంధం అన్నట్లు ఇజ్రాయెల్‌ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. 

అయితే ఈ విషయమై బీఏసీ కన్సల్టింగ్‌ వాదన మరోలా ఉండటం విశేషం. ‘‘ పేజర్ల తయారీలో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం కేవలం వాటిని రవాణా చేశాం’’ అని బీఏసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిణి క్రిస్టినా బార్సోనీ అర్సిడియాకోనో స్పష్టంచేశారు. పేలిన పేజర్లను మాత్రమేగాక సాధారణ పౌరుల కోసం కూడా వేలాది పేజర్‌లను ఈ సంస్థ తయారుచేసినట్లు సమాచారం. ఈ సాధారణ పేజర్‌లు ఏవీకూడా పేలినట్లు వార్తలు రాలేదు. హెజ్‌బొల్లా సభ్యులు వాడిన, పేలిన పేజర్‌లు 2022 ఏడాది అర్ధభాగంలో తయారుచేసి ఉంటారని తెలుస్తోంది.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)