Breaking News

పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట!

Published on Sat, 08/12/2023 - 08:52

ఇజ్రాయెల్‌లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో  చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతికి పురాతన అద్దం దొరికింది. ఇది 1500 ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అద్దాన్ని పురాతన కాలంనాటి ప్రజలు తమపై చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఉపయోగించేవారని సమాచారం. 

హైఫాకు చెందిన ఆ అమ్మాయి పేరు అవివ్ వీజ్‌మన్. ఈ అమ్మాయి ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ చేపట్టిన పురావస్తు తవ్వకాల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ఆమెకు అద్దం లభించింది. ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల పనుల్లో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో అవివ్ వీజ్‌మన్ ఒకరు. పురావస్తు శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

బైజాంటైన్ కాలం నాటి అద్దం
ఈ అద్దం దొరికిన ప్రదేశానికి ఉష అని పేరు పెట్టారు. ఇది బైజాంటైన్ కాలం నాటిదని సమాచారం. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ క్యూరేటర్ నెవిట్ పోపోవిచ్ తెలిపిన వివరాల ప్లేట్ మధ్యలో  ఉన్న ఈ గాజు అద్దం  6వ శతాబ్దపు బైజాంటైన్ కాలం నాటి 'మ్యాజిక్ మిర్రర్'లో భాగమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అద్దం అంత్యక్రియలకు బహుమతిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.

భవనం గోడ నుండి బయటపడిన అద్దం
తవ్వకాల్లో భాగంగా డిగ్గర్లు తమ పనిలో నిమగ్నమై ఉండగా, 17 ఏళ్ల అవియాకు ఆ అద్దం కనిపించింది. ఆమె దానిని సీనియర్ అధికారులకు చూపించింది. దానిని పరిశీలించిన అధికారులు అది1500 సంవత్సరాల నాటి అద్భుత అద్దం అని, దానిని చెడు దృష్టిని పోగొట్టుకునేందుకు ఉపయోగించేవారని తెలిపారు. ఇది దెయ్యాలు తరహా దుష్టశక్తులను దూరం చేస్తుందని నాటి కాలంలో నమ్మేవారట. దుష్టబుద్ధి కలిగినవారు ఈ అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు, అద్దం యజమానిపై చెడు ప్రభావం ఉండదని నమ్మేవారట. అంత్యక్రియలకు బహుమతులుగా ఇలాంటి అద్దాలు ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది.  
ఇది కూడా చదవండి: వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం!

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)