Breaking News

కమాండర్లే చేతులెత్తేస్తే.. ట్రైనీ సైనికులు సిన్వార్‌ను మట్టుబెట్టారు

Published on Fri, 10/18/2024 - 20:01

ఇజ్రాయెల్ ద‌ళాలు హమాస్ మాస్టర్‌మైండ్ య‌హ్యా సిన్వర్‌ను హ‌త‌మార్చాయి. అయితే సిన్వ‌ర్ త‌ర్వాత హ‌మాస్‌కు ఎవ‌రు సార‌థ్యం వ‌హిస్తారు? అనే చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ త‌రుణంలో సిన్వ‌ర్‌ను మ‌ట్టుబెట్టిన‌ ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యంలో వెలుగులోకి వ‌చ్చింది.

గ‌తేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో  దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హ‌మాస్ అగ్ర‌నేత‌ య‌హ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.

సంవ‌త్స‌ర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇత‌ర నిఘూ వ‌ర్గాలు సిన్వార్ జాడ క‌నిపెట్ట‌లేక‌పోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ట్రైనీ సైనికులు ద‌క్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చ‌ర్య‌ల్లో ఓ భ‌వంతిలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్‌తో దాడులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డికి వెళ్లి చూడ‌గా.. ముగ్గురి మృతదేహాలు ల‌భ్యమ‌య్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించ‌లేని విజ‌యాన్ని ట్రైనీ సైనికులు సాధించ‌డంపై ఇజ్రాయెల్ ప్ర‌భుత్వం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)