Breaking News

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

Published on Fri, 01/09/2026 - 18:28

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు దిగింది. దక్షిణ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ ఆక్రమణ దళాలు (IOF) వైమానికదాడులు జరుపుతున్నాయి. నష్టం వివరాలు తెలియరావాల్సింది. అయితే తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌-హోజ్‌బొల్లా ఘర్షణలు మళ్ల తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్‌బొల్లా షెల్టర్‌లను టార్గెట్‌ చేశాయి. సాజ్‌, అల్-రయ్‌హాన్‌, మౌంట్‌ అల్-రఫీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. దీర్‌ అల్-జహ్రాని, హౌమిన్‌ అల్-ఫౌఖా ప్రాంతాల గగనతలంలో ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాల సంచారం కనిపించిందని తెలుస్తోంది. 

మరోవైపు.. దీర్‌ అల్-జహ్రాని–హౌమిన్‌ అల్-ఫౌఖాలోని లోయపై బాంబుదాడి జరిగింది. ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని క్ఫార్ఫిలా, రూమైన్, మౌంట్ రయ్‌హాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా దాడులతో స్పష్టమవుతోంది. అటు వాది హమిలా ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు సమాచారం. 

హెజ్‌బొల్లాకి చెందిన మిసైల్‌ ప్లాట్‌ఫారమ్‌లు, ఆయుధ గిడ్డంగులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ఇప్పటికే ప్రకటించుకుంది. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన సీజ్‌ఫైర్‌ తర్వాత కూడా ఇజ్రాయెల్‌ 10,000కిపైగా ఉల్లంఘనలు జరిపిందని UNIFIL (United Nations Interim Force in Lebanon) గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్ తాజా దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. లెబనాన్‌లోని పలు గ్రామాల ప్రజలను తక్షణ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌ చర్యలను ఖండిస్తూ.. ఐక్యరాజ్య సమితి కూడా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)