Breaking News

ఇజ్రాయెల్‌ దాడికి మరోమారు గాజా విలవిల

Published on Mon, 03/24/2025 - 12:19

దేర్ అల్ బలా: గాజాపై ఇజ్రాయెల్  నిరంతర దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) దక్షిణ గాజాలోని ప్రముఖ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల  అనంతరం ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతకుముందు దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకునితో సహా 26 మంది పాలస్తీనియన్లు(Palestinians) మృతిచెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిపై దాడిని ధృవీకరించింది. యాక్టివ్‌గా ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడి జరిగిందని తెలిపింది.
 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war)లో ఇప్పటివరకూ 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక లక్షా 13 వేల మందికి పైగా జనం గాయపడ్డారని  పేర్కొంది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 673 మంది మృతిచెందారు. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది  ఏడాది లోపు వయసు కలిగినవారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్‌ 7న ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)